ayodhya kanda

Valmiki Ramayanam-Ayodhya kanda

అయోధ్య కాండ
Ayodhya kanda

భరతుడు తన మేనమామ గారితో కూడా తాత గారి ఇంటికి వెళ్లాడు.తనతో కూడా శత్రుఘ్నుడు తీసుకొని వెళ్లాడు. భరతశత్రుఘ్నులు మేనమామ ఇంట్లో సుఖసంతోషాలతో ఉన్నప్పటికీ, అయోధ్యలో ఉన్న తల్లిదండ్రులను మరిచిపోలేదు. పతిరోజూ తమ తల్లితండులను మనసారా తల్చుకుంటూ ఉన్నారు.

అదే ప్రకారంగా దశరథుడు కూడా తన కుమారులు భరతశత్రుఘ్నులు ఏం చేస్తున్నారో ఏమో అని ప్రతి రోజూ తల్చుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే దశరథునికి తన నలుగురు కుమారులను సమానంగా ప్రేమించాడు, ఆదరించాడు. అందుకనీ భరత శత్రుఘ్నులు తన ఎదుటలేకపోయినా అనుదినమూ వారిని తల్చుకుంటూ ఉండేవాడు.

కాని తన నలుగురు కుమారులలోనూ పెద్ద కుమారుడు రాముడు అంటే దశరథునకు ప్రేమాభిమానాలు కొంచెం ఎక్కువగా ఉండేవి. కౌసల్యకు కూడా రాముడు అంటే పంచప్రాణాలు. రాముని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. ఇంక రాముడు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేవాడు.

రాముడు మంచి రూపవంతుడు. శౌర్యవంతుడు. పైగా దశరథుని కుమారుడు. రాముడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో ఉండేవాడు. అందరితో మృదువుగా మాట్లాడేవాడు. తనతో ఎవరైనా కటువుగా మాట్లాడినా మౌనంగా ఉండేవాడే కాని వారితో పరుషంగా మాట్లాడేవాడు కాదు రాముడు అల్ప సంతోషి. ఎవరైనా చిన్న ఉపకారం చేసినా అమితంగా సంతోషించేవాడు. తనకు ఎవరు ఎన్ని అపకార ములు చేసినా వాటిని మనసులో పెట్టుకొనే వాడు కాదు.

రాముడు అస్త్ర విద్య శస్త్ర విద్యలు సాధన చేసేవాడు. తీరిక సమయములలో వయోవృద్ధుల జ్ఞాన వృద్ధుల వద్దకు పోయి మంచి విషయములు నేర్చుకొనే వాడు. అంతేగాని వినోద విలాసములతో సమయమునువ్యధా చేసేవాడు కాదు.రాముడు అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉండేవాడు ముందు తనే అందరినీ పలుకరించి వారి యోగక్షేమములు అడిగి తెలుసుకొనేవాడు.

తాను అమితమైన పరాక్రమ వంతుడైనను కొంచెం కూడా గర్వము లేకుండా అందరితో కలిసిపోయేవాడు.రాముడికి ఉన్న మరొక మంచి లక్షణం రాముడు ఎన్నడూ అసత్యము పలికేవాడు కాదు. బ్రాహ్మణులను, పెద్దలను గౌరవించేవాడు. ప్రజలు తనను ఏ ప్రకారం గౌరవిస్తాడు అదే ప్రకారము రాముడు కూడా ప్రజలు గౌరవించేవాడు. రాముడికి కోపం అంటే ఏమిటో తెలియదు. అందరి మీద దయకలిగి ఉండేవాడు. దీనులను చూచి జాలిపడేవాడు. తోచిన సహాయము చేసేవాడు.

ఇక చదవండి……..

Valmiki Ramayanam Ayodhya Kanda

Download PDF Book

Read Valmiki Ramayanam Ayodhya Kanda online here.

Valmiki-Ramayanamu-ayodhyakanda











































Follow us on Social Media