Jungle book in Telugu PDF chandamama kathalu
సీయోనీ కొండలలో ఒక గుహ. అందులో ఒక తోడేలయ్య సకుటుంబంగా కాపరం ఉంటున్నాడు. అతడికి భార్య, నలుగురు పసికందులూనూ.
సాయంకాలం ఏడయింది. చంద్రుడు గుహలోకి తొంగి చూస్తున్నాడు. తోడేలయ్య కాళ్ళు చాచి, ఒళ్ళు విరుచుకుని, నిద్ర లేచాడు. వేటకు వేళ అయింది. తోడేలయ్య కొండ దిగిపోదామనుకుంటుండగా గుహ ద్వారాన నీడ కనపడింది. “శుభం కలగ వలె, తోడేలుదొరా ! పిల్లలకు గట్టి దంతాలు రావలె! ధర్మం వర్థిల్లవలె!” అన్నది నక్క అతి వినయంగా.
నక్క తబకీ అంటే తోడేళ్ళకు తగని రోత. అది అన్నిచోట్లా చెడతిరిగి, చాడీకోరు కబుర్లు చెబుతుంది. ఎంగిలి నాకుతుంది ఏ చెత్తపోగు మీది తోలుముక్కలైనా కొరుకు తుంది. గుడ్డపీలికలను కూడా విడిచి పెట్టదు.
అయితే నక్క అంటే తోడేళ్ళకు కొంత భయం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఉన్నట్టుండి దానికి పిచ్చెత్తుతుంది. పిచ్చి నక్క అంటే పులికి కూడా హడలే. పిచ్చినక్క కాటు వల్ల సంభవించే మరణం మహా దారుణమైనది.
లోపలికి వచ్చి చూసుకో కావలిస్తే, తిండి ఏమీలేదు,” అన్నది తోడేలు నక్కతో.
” తమకు లేకపోవచ్చు. నాబోటివాడి కెంత కావాలి? ఎండు ఎముకైనా చాలు, అంటూ నక్క గుహమూల పడి ఉన్న ఒక ఎముక మీది మాంసం గీరుకు తింటూ, ఆహా, ఎంత చక్కని భోజనం 1 ఎంత చక్కని పిల్లలు! చెంపకు చారడేసి కళ్ళు !…. అన్నట్టు పేర ఖాన్ గారు అంటే పెద్దాయన మన ప్రాంతాలకి వేటాడ వచ్చారు. ఈ నెలల్లా అక్కడే వేటాడుతూ ఉండిపోతామని నాతో అన్నారు !” అన్నది.
ఇక చదవండి……
Books Are taking time to Load Please Stay with Us ,Thank You.
Jungle Book Story in Telugu Download PDF Book
Jungle Book Story in Telugu Online here
Aranya-Puranam-Jungle-BookFollow us on Social Media