Nagula Chavithi Pooja Vidhanam

Nagula Chavithi

Nagula Chavithi

నాగుల చవితి

నాగుల చవితి కార్తీక మాసంలో వస్తుంది. కుమారస్వామి తార కాసురుని సంహరించి జారకాదిపతివలె ప్రకాశిస్తాడు . అందువల్ల చాలా ప్రాంతాలలో నాగులను స్కందు డుగా, కార్తికేయుడుగా, కుమారస్వామిగా, మురుగన్ వంటి పేర్లతో ఆరాధిస్తారు. ఈ నాగారాధన చేసేరోజున భూమిని దున్నుట, తవ్వడం, చెట్టు. పుట్టలను కొట్టడం, కూరగాయలు తరగడం వంటావార్పు చేయడం నిషేధం అని ఇతిహాస పురాణాల్లో వివరించబడింది.

 శ్లోకం:
శ్రావణ మాసే పంచమ్యాం శుక్లపక్షోతు పార్వతి ద్వారస్యోభయతో లోఖ్యాగోమయన విషోల్పణా పూజయే ద్విధివద్వేరలాజై,
పంచామృతై స్పహా విశషతస్తు పంచమ్యాం పయసా పాయన సభ:
ఓం. శాంతి: శాంతి:

తరిగిన కూరలతో వంట చేసుకోవడం నాగులచవితి రోజున చాలా కుటుంబాలలో అనాదిగా వస్తున్న ఆచారం.

పండుగ రోజున చేయవలసిన విధులు:

నాగుల చవితి రోజు ఉదయాన్నే లేచి తలంటుకుని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి. తర్వాత దగ్గరలో వున్న పుట్ట దగ్గరకు పోయి దీపం వెలిగించి, పూజ చేయాలి. పూజ అయిన తర్వాత చలిమిడి చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, ఇంకా అరటిపండ్లు నైవేద్యం పెట్టి, ఆరోజంతా పగలు ఉపవాసం ఉండాలి. రాత్రికి భోజనం చేయాలి. చెవి బాధలు, కంటి బాధలు వున్న వారికి చవితి ఉపవాసం మంచిది. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరం, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్ర నామములు, పఠిస్తే సకల దోషాలు పోతాయని విశ్వాసం. అలా వీలుకాని పక్షంలో “ఓం నాగేంద్రస్వామినే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

ప్రకృతిలో భాగం :

ఇంతకీ ఈ విషనాగులను మనం పూజించట మేమిటి? అన్న ప్రశ్న వెంటనే తలెత్తుతుంది చాలామందిలో, ఈ పండుగలోని ఆంతర్యమేమిటో ఒక్కసారి పరిశీలిద్దాము. ‘ప్రకృతి’ మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి ఆనాటి నుండి నేటి వరకూ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని- ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూచుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. అదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా మనం పరిశీలిస్తే… అందులో భాగంగానే ‘పాము’ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. పాముల్ని భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి “నీటిని” ప్రసాదించే దేవతలుగా భావిస్తారు.. ఇవి వంటలను నాశనంచే సే క్రిమికీటకాలను తింటూ, పరోక్షంగా “రైతు “కు పంటనష్టం కలుగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

అంతరార్థం ఎమిటంటే :

మానవ శరీరమనే పుట్టలో నిదురిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు. ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను “వెన్నుబాము ” అంటారు. అందులోని కుండలినీ శక్తి మూలాధారచక్రంలో ‘పాము’ ఆకారమువలెనే చుట్టలు చుట్టుకుని వుంటుందని “యోగశాస్త్రం’ చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాతృర్యాల నే విషాల్ని గ్రక్కుతూ, మానవునితో ‘సత్యగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. అలా నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టను

ఆరాధించి పుట్టలోపాలు పోస్తే మానవుని లో ఉన్న విషసర్పం కూడా’ శ్వేతత్వం పొంది, మన హృదయాలలో నివశించే ‘శ్రీమహావిష్ణువు ‘నకు పొన్సుగా వుండే ఆది శేషువుగా మారి ‘శేషపా మారాలనేదే ఈ నాగుల చవితి పండుగలో గల ఆంతర్యమని చెప్తారు. దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, త

కార్తీకమాసములో వచ్చే షష్టీ చతుర్జశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం

కలిసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తారు .


పాహి పాహి సర్పడున నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ!
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా

దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు. కార్తీకమాసములో వచ్చే షఫీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలిసివచ్చే రోజు కాని దినమంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తారు –

అలా ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి, చలిమిడి, చిమ్మిలి అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద ‘దీపావళి’ నాటి మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానము, అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభింస్తాడని చాలామంది నమ్ముతారు

కలిదోష నివారణకు..

ఈ నాగులచవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి

కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ! ఋతుపర్ణస్య రాజ కీర్తనం కలినాశనమ్ 
ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరంపూలు, లడ్డు మున్నగునవి ప్రీతికరమని చెప్తాడు

వర్సారాధనచేసే వారి వంశం ‘తామరతంపరగా’ వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెప్తోంది భారతీయుల ఇళ్ళలో జలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే! ఆయన అందరికీ ఆరాధ్య దైవంకా పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.
చివరగా ఒక్క మాట.

పాము పేరు చెపితేనే బెదరిపోతూ ఉంటాము. ఎక్కడైనా కనిపిస్తే చంపితే కానీ శాంతించరు. అంతకంటే భయంకరమైన మానవులు మనలోనే ఉన్నారు.

తలనుండు విషము ఫణికిని వెలయంగా తోకనుండి వృశ్చికమునకున్. తలతోకయనకు యుండు ఖలునకు నిలువెల్ల విషము గదరాసుమతీ!

అని చెప్పినట్లు ,అలా మనచుట్టూ మానవరూపంలో ఉంటే మానవులు, సర్పజాతి మనసుకంటే, నికృష్ణమైన (అవి మనం వాటి జోలికి వెళితేనే ప్రమాదకరమవుతాయి) కాని వాటికంటే భయంకరమైన మా ఏర్పాలు మనచుట్టూ తిరుగుతున్నా గమనించలేక పోతున్నాం! వారికన్న ఈ పర్పాలేమీ ప్రమాదకరమైనవి కావు.

 

Follow us on Social Media