Siddhidhatri

Siddhidatri

సిద్ధిదాత్రి

Siddhidatri

https://youtu.be/_DPWRIegfAo?rel=0

అణిమ (శరీరమును అతి చిన్నదిగా చేయుట), మహిమ (శరీరమును అతి పెద్దదిగా చేయుట), గరిమ (శరీరము బరువు విపరీతముగా పెంచుట), లఘిమ (శరీరమును అతి తేలికగా చేయుట), ప్రాప్తి (కావలసిన వస్తువులు పొందుట), ప్రాకామ్యం (కావలసిన భోగము అనుభవించుట), ఈశత్వం (ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందుట), వశీత్వం (అన్ని భూతములను లోబరచుకొనుట) అని పిలువబడే అష్టసిద్ధులను అనుగ్రహించే అవతారమే సిద్ధిదాత్రి దేవి, నవదుర్గల్లోని తొమ్మిదవ అవతారం.

అతీంద్రియ ధ్యాన శక్తిని, సిద్ధులను, సాఫల్యతను అనుగ్రహించే దేవతగా ఈ అవతారాన్ని ప్రార్థిస్తారు. సిద్ధిధాత్రి అమ్మవారు, భక్తుల యొక్క ప్రాపంచిక, మరియు దైవిక ఆకాంక్షలను నెరవేరుస్తుంది. ఈ అమ్మవారిని ఆరాధించేవారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని పురాణోక్తి. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రీ దుర్గాదేవిని పూజిస్తారు.

ఒక్కో దేవీదేవతల ఆరాధనకు ఒక్కో తిథి ఉత్కృష్టమైందిగా చెబుతారు. నవమి తిథి, ధైర్యానికీ, ధర్మానికీ, శత్రు సంహారానికీ ప్రతీకగా నిలుస్తుంది. మహార్నవమి రోజున అమ్మవారిని అపరాజిత, అంటే ఓటమి తెలియని దేవిగా పూజిస్తారు.

అర్థనారీశ్వర అవతారంలోని సగ భాగం శివుని శరీరమైతే, మరొక సగం సిద్ధిదాత్రి అమ్మవారు.

శివుడు కూడా ఈ దేవతను ఆరాధించడం ద్వారానే అన్నీ సిద్ధులను పొందాడని వేదోక్తి.

సృష్టి ఆరంభంలో ఆదిపరాశక్తి నుంచి ఉద్భవించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. వారి తపస్సుకి మెచ్చిన మహాశక్తి, ప్రత్యక్షమై, “సృష్టి, స్థితి, లయములు” అను విధులను త్రిమూర్తులకు అప్పగించింది కూడా “సిద్ధిదాత్రి” అవతారంలోనే.

ఈ రూపం లోని అమ్మవారు, కమలం, గదాయుధం, శంఖ చక్రాలు ధరించిన చతుర్భుజాలతో, వికసించిన కమలం మీద, లేదా సింహం మీద కూర్చొని మనకు దర్శనమిస్తుంది.

సిద్ధిదాత్రి అమ్మవారు కేతుగ్రహానికి అధిపతి.

ఓం దేవీ సిద్ధిదాత్ర్యై నమః॥

ప్రార్థన:

సిద్ధ గన్ధర్వ యక్షాద్యైరసురైరమరైరపి।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ॥

స్తుతి:

యా దేవీ సర్వభూ‍తేషు మాఁ సిద్ధిదాత్రీ రూపేణ సంస్థితా।
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః॥

ధ్యానం:

వన్దే వాఞ్ఛిత మనోరథార్థ చన్ద్రార్ధకృతశేఖరామ్।
కమలస్థితామ్ చతుర్భుజా సిద్ధీదాత్రీ యశస్వినీమ్॥
స్వర్ణవర్ణా నిర్వాణచక్ర స్థితామ్ నవమ్ దుర్గా త్రినేత్రామ్।
శఙ్ఖ, చక్ర, గదా, పద్మధరాం సిద్ధీదాత్రీ భజేమ్॥
పటామ్బర పరిధానాం మృదుహాస్యా నానాలఙ్కార భూషితామ్।
మఞ్జీర, హార, కేయూర, కిఙ్కిణి రత్నకుణ్డల మణ్డితామ్॥
ప్రఫుల్ల వన్దనా పల్లవాధరాం కాన్త కపోలా పీన పయోధరామ్।
కమనీయాం లావణ్యాం శ్రీణకటిం నిమ్ననాభి నితమ్బనీమ్॥

స్తోత్రం:

కఞ్చనాభా శఙ్ఖచక్రగదాపద్మధరా ముకుటోజ్వలో।
స్మేరముఖీ శివపత్నీ సిద్ధిదాత్రీ నమోఽస్తుతే॥
పటామ్బర పరిధానాం నానాలఙ్కార భూషితామ్।
నలిస్థితామ్ నలనార్క్షీ సిద్ధీదాత్రీ నమోఽస్తుతే॥
పరమానన్దమయీ దేవీ పరబ్రహ్మ పరమాత్మా।
పరమశక్తి, పరమభక్తి, సిద్ధిదాత్రీ నమోఽస్తుతే॥
విశ్వకర్తీ, విశ్వభర్తీ, విశ్వహర్తీ, విశ్వప్రీతా।
విశ్వ వార్చితా, విశ్వాతీతా సిద్ధిదాత్రీ నమోఽస్తుతే॥
భుక్తిముక్తికారిణీ భక్తకష్టనివారిణీ।
భవసాగర తారిణీ సిద్ధిదాత్రీ నమోఽస్తుతే॥
ధర్మార్థకామ ప్రదాయినీ మహామోహ వినాశినీం।
మోక్షదాయినీ సిద్ధీదాయినీ సిద్ధిదాత్రీ నమోఽస్తుతే॥

కవచం:

ఓంకారః పాతు శీర్షో మాఁ, ఐం బీజమ్ మాఁ హృదయో।
హీం బీజమ్ సదాపాతు నభో గృహో చ పాదయో॥
లలాట కర్ణో శ్రీం బీజమ్ పాతు క్లీం బీజమ్ మాఁ నేత్రమ్‌ ఘ్రాణో।
కపోల చిబుకో హసౌ పాతు జగత్ప్రసూత్యై మాఁ సర్వవదనో॥

ఆరతి:

జయ సిద్ధిదాత్రీ మాఁ తూ సిద్ధి కీ దాతా।
తు భక్తోం కీ రక్షక తూ దాసోం కీ మాతా॥

తేరా నామ లేతే హీ మిలతీ హై సిద్ధి।
తేరే నామ సే మన కీ హోతీ హై శుద్ధి॥

కఠిన కామ సిద్ధ కరతీ హో తుమ।
జభీ హాథ సేవక కే సిర ధరతీ హో తుమ॥

తేరీ పూజా మేం తో నా కోఈ విధి హై।
తూ జగదమ్బేం దాతీ తూ సర్వ సిద్ధి హై॥

రవివార కో తేరా సుమిరన కరే జో।
తేరీ మూర్తి కో హీ మన మేం ధరే జో॥

తూ సబ కాజ ఉసకే కరతీ హై పూరే।
కభీ కామ ఉసకే రహే నా అధూరే॥

తుమ్హారీ దయా ఔర తుమ్హారీ యహ మాయా।
రఖే జిసకే సిర పర మైయా అపనీ ఛాయా॥

సర్వ సిద్ధి దాతీ వహ హై భాగ్యశాలీ।
జో హై తేరే దర కా హీ అమ్బేం సవాలీ॥

హిమాచల హై పర్వత జహాం వాస తేరా।
మహా నందా మందిర మేం హై వాస తేరా॥

ముఝే ఆసరా హై తుమ్హారా హీ మాతా।
భక్తి హై సవాలీ తూ జిసకీ దాతా॥

***

*** శ్రీ మాత్రే నమః ***

Follow us on Social Media