Sri Manasa devi stotram
Sri Manasa devi stotram
శ్రీ మానసా దేవి స్తోత్రం
మానసా దేవి ద్వాదశ నామాలు ఎవరు శ్రద్ధతో పట్టిస్తారో వారికి ,వారి వంశజులకు సర్ప భయం ఉండదు. ఎవరి ఇండ్లలో , ఇండ్ల కట్టుకొనే ప్రదేశాలలో సర్పాలు తిరుగుతూ ఆ ప్రదేశం నివాసయోగ్యం కాకుండా పోతుందో , వారు ఈస్తోత్రం జపించిన నిస్సంశయంగా సర్ప భయం నుండి విముక్తులవుతారు. ఈ శ్లోకాలను నిత్య పారాయణ చేసేవారికి సర్ప భయం కలుగదు.
11 సార్లు 108 జపం చేసిన వారికి మానసా దేవి స్తోత్రం అనుగ్రహం కలుగుతుంది. సంతాన వృద్ధి చెందుతుంది. ఎటువంటి సర్పదోషాలు అయినా సరే తొలగిపోతాయి.
ఓం నమో మనసాయై |
జరత్కారుర్జగద్గౌరీ మనసా సిద్ధయోగినీ |
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా || 1 ||
జరత్కారుప్రియాస్తీకమాతా విషహరీతీ చ |
మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా || 2 ||
ద్వాదశైతాని నామాని పూజాకాలే చ యః పఠేత్ |
తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ || ౩ ||
నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే |
నాగక్షతే నాగదుర్గే నాగవేష్టితవిగ్రహే || 4 ||
|| ఫలశ్రుతి ||
ఇదం స్తోత్రం పఠిత్వా తు ముచ్యతే నాత్ర సంశయః |
నిత్యం పఠేద్యస్తం దృష్ట్వా నాగవర్గః పలాయతే || 5 ||
దశలక్షజపేనైవ స్తోత్రసిద్ధిర్భవేన్నృణామ్ |
స్తోత్రం సిద్ధిం భవేద్యస్య స విషం భోక్తుమీశ్వరః || 6 ||
నాగౌఘం భూషణం కృత్వా స భవేన్నాగవాహనః |
నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భవేన్నరః || 7 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణే ప్రకృతిఖండే మనసాదేవీ ద్వాదశనామ స్తోత్రమ్ ||
Follow us on Social Media