
Usiri chettu Pooja Vidhi
Usiri chettu Pooja Vidhi
ఉసిరి చెట్టు వద్ద చేసే చేయవలసిన పూజా శ్లోకాలు.
పవిత్రమైన కార్తీకమాసంలో శివకేశవుల ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది. తులసి, ఉసిరికోట ముందు దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలుగుతాయని కార్తీక పురాణం చెబుతుంది. ఈ మాసంలో ఉసిరికను పూజించటం వలన చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరవని శాస్త్రాలు చెబుతున్నాయి.కార్తీకమాసంలో ఉసిరి చెట్టు వద్ద చేసే ప్రార్థన కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలతో దీపాలు వెలిగించి చేయవలసిన పూజా శ్లోకాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాన్ దేహి మహా ప్రాజే యశోదేహి బలంచమే
ప్రజ్ఞం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా
ఓం దాత్ర్యై నమః
ఓం శాంత్యె నమః
ఓం కాంత్యై నమః
ఓం మేధాయై నమః
ఓం కళ్యాణ్యే నమః
ఓం విష్ణుపతై నమః
ఓం మహాలక్ష్మ్యైనమః
ఓం ప్రకృత్యె నమః
ఓం ఇందిరాయై నమః
ఓం సుధ్వత్యై నమః
ఓం రమాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం అఖితనయాయై నమః
ఓం గాయతై నమః
ఓం పావిత్రై నమః
ఓం విశ్వరూపాయై నమః
ఓం సురూపాయై నమః
ఓం కమనీయాయై నమః
ఓం అవ్యక్తాయై నమః
ఓం కమలాయై నమః
ఓం జగద్ధాత్ర్యై నమః.
Follow us on Social Media