KUSHMANDA

Kushmanda Devi

 

కుష్మాండదేవి

Kushmanda Devi

 

నవరాత్రులలో నాలుగవ రోజు అమ్మవారిని కుష్మాండదేవిగా పూజిస్తారు .అమ్మవారి అవతారం సృష్టి ప్రారంభానికి ముందు అంటే ,సృష్టి అంతా శూన్యంలో అంధకారంలో ఉన్నప్పుడు వచ్చిన అవతారం. ఒకసారి శూన్యం నుండి తేజోవంతమైన కాంతి ఉద్భవించింది , ఆ కాంతి మెల్లగా ఒక స్త్రీ స్వరూపం ధరించి,అఖండమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంది . ఆమె ఒక అండాన్ని సృష్టించింది ,ఆ అండం నుంచి సమస్త బ్రహ్మాండాలు ఉద్భవించాయి. కు అనగా చిన్న యుషమా అనగా శక్తి అంతా అనగా సృష్టి లేదా బ్రహ్మాండం అని అర్థం. చిన్న అండం నుండి సమస్త బ్రహ్మాండాలు సృష్టించింది కనుక అమ్మవారికి కుష్మాండ అని పేరు వచ్చింది.
శూన్యంలో ఉన్న సృష్టిని తన చిరు మందహాసంతో సూర్యచంద్రులను నవగ్రహాలను, నక్షత్రాలను, భూమి ఆకాశాలను సృష్టించింది. సూర్య మండలానికి మధ్యలో తానే స్వయంగా కూర్చుని సమస్త సృష్టినీ ప్రకాశవంతం చేసింది. ప్రపంచానికి సూర్యుడు ఆత్మ అయితే సూర్యుని శక్తి కుష్మాండదేవి. ప్రపంచంలో ఉన్న ప్రతి శక్తికి ఆధారమూలం కుష్మాండదేవి.

అటు పిమ్మట కుష్మాండ దేవి తన త్రీనేత్రముల నుండి 3 శక్తులను ఉద్భవింపచేసింది. అమ్మవారి మూడవ నేత్రం నుండి మహాలక్ష్మీదేవి, ఎడమ నేత్రం నుండి మహాకాళి, కుడి నేత్రం నుండి మహా సరస్వతి ఉద్భవించారు. మహాకాళి నుండి శివుడు ,సరస్వతి దేవి, మహాలక్ష్మి నుండి బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి మహాసరస్వతి నుండి విష్ణుమూర్తి ఆదిశక్తి ఉద్భవించారు. అందుకే విష్ణుమూర్తిని పార్వతీదేవికి అన్నగా చెబుతారు.
అటుపిమ్మట విష్ణుమూర్తి ,లక్ష్మీదేవి ,శివుడు పార్వతి దేవి మరియు బ్రహ్మ, సరస్వతీదేవిల వివాహం జరిగింది.
ఈ అవతారంలో అమ్మవారు అష్ట భుజాలతో సింహవాహనం మీద 1000 సూర్య ప్రకాశంతో ఉంటుంది. అష్టభుజాలలో వరుసగా మండలం బాణం ,విల్లు ,కమలం, జపమాల, చక్రం ధరించి ఉంటుంది.
అష్టభుజాలను కలిగి ఉంటుంది కనుక అమ్మవారిని అష్టభుజదేవి అని కూడా పిలుస్తారు.
కుష్మాండ దేవి ఉపాసన వల్ల యొక్క నాలుగవ చక్రం అనాహత చక్రం ఉత్తేజితం అవుతుంది .అనాహత చక్రం ఉత్తేజితం కావడం వల్ల మనుషుల లోని ద్వేషాలను అహంకారాన్ని అంతం చేస్తుంది.
కుష్మాండ దేవి ఆలయం వారణాసిలోని ఘటంపుర్ అనే ప్రాంతంలో ఉంది.అమ్మవారిని పూజించిన భక్తులకు ఈతిబాధలు పోగొట్టి మనశ్శాంతిని కలుగజేస్తుందని ప్రతీతి.

https://youtu.be/cj7eldYOR0M?rel=0

కుష్మాండ దేవి మంత్రాలు:

ఓం దేవి కుష్మాండాయై నమః

ఓం దేవి కుష్మాండాయై నమః సురాసంపూర్ణ కలశం రుద్రిరప్లుతమే చా

దదానా హస్తపద్మభ్యాం కుష్మండా శుభదాస్తు మి

***

*** శ్రీ మాత్రే నమః ***

Follow us on Social Media