Mahabharatam-Sabhaparvam(vol-3)
సభాపర్వం
Sabhaparvam
నేను దానవశిల్పిని, వివిధకళల్లోనేర్పరిని. మీ కిష్టమైనదాన్ని నిర్మించి ఇస్తా, ఆజ్ఞాపించండి’ అని మయుడు అర్జునుడు అడిగాడు. అర్జునుడు శ్రీ కృష్ణుడు ముఖం చూచి ఏదైనా ఒక అపూర్వమైనదాన్ని నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించం’డని అన్నాడు. శ్రీకృష్ణుడు చాలా సేపు ఆలోచించి మయునితో ఇలా అన్నాడు.
ధర్మరాజు కురువంశప్రభువు. అంతేకాదు, అందరు రాజులు సేవించడగిన శాశ్వతనైతనంతో విరాజిల్లే ప్రభుడు. అలాంటి ధర్మరాజుకు ఆనందదాయకంగా, నానావిధ రత్నపమూహాలతో అందంగా, లోకాసికే అపూర్ణంగా నీ శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా ఒక మహాసభను నుంచి వెంటనే తీసుకొని రా.
వైభవంలో, భోగానుభవంలో, దేవేంద్ర రాక్షసేంద్రులకంటె మనుజేంద్రుడైన ధర్మరాజు ఈ ధర మీద ఉన్న. ఆయన గొప్పతనానికి తగ్గట్లు, దేవతలమేడలైనా ఇంత బాగుంటాయా అని జనులంతా దానినే మెచ్చి యాచేటట్లు, మణుల కాంతితో మెరిసే ఒక మహాసభను మనసార నిర్మించి ఇస్తా.
పూర్వం వృషపర్వుడనే రాక్షసరాజుకు ఒక సభను నిర్మించి ఇవ్వాలని, నానావిధరత్నాలతో కూడిన నిర్మాణ సామగ్రిని సమకూర్చాను. ఆ సామగ్రినంతా బిందుసరం అనే సరోవరంలో భద్రపరచాను. ఇప్పుడా సామగ్రిని ఉపయోగించి చిత్ర, విచిత్రమైన సభను నిర్మిస్తాను. దాన్ని ధర్మతనయునికి బహూకరిస్తాను. అంతే కాదు భౌమాదిత్యుడనే రాజర్షి ఉంచిన గదాశంఖాలు నా అధీనంలోనే ఉన్నాయి. సర్వశత్రువుల్ని హతమార్చే భీమసేనుని కిస్తాను. మహాభయంకరమైన దివ్యగ్యని గల దేవదత్తశంఖాన్ని అర్జునునికిస్తాను’ – అని మయుడు ఆగదు ధర్మరాజు చేత సన్మానం పొంది. అక్కడినుండి బయలుదేరాడు.
శ్రీకృష్ణుడు కూడ తన తండ్రిని చూడాలన్న ప్రబలకుతూహలంతో- పాండవుల దగ్గర సెలవు తీసికొని ద్వారవతికి వెళ్ళాడు. మయుడు ఈశాన్యదిశగా పయనించి కైలాసపర్వతానికి ఉత్తరాన మైనాకపర్వతంమీది హిరణ్యశిఖరాన్ని చేరుకొన్నాడు.
మయుడు ముందుగా దేవతలను, బ్రాహ్మణులను పూజలతో తృప్తి పరచి, భూకాంతకు అందమైన అపూర్వాలంకారంగా సభా నిర్మాణానికి పూనుకున్నాడు.ఇంద్రనీలమణుల కిరణా లనే నీళ్ళతో, పద్మరాగమణులతో చెక్కిన ఎర్రనిపద్మాలతో, వెండితో చేసిన తెల్లతామరలతో, రాజహంసలతో, మేలిమి బంగారుతో పోతపోసిన తాబేళ్ళతో, మనోహర వైదూర్యాలతో మలిచిన కలువలతో, వజ్రాలతో చేసిన చేపలతో, ముత్యాలు కల్పించిన కొంగ్రొత్త పరుగులతో మరకతంతో రూపొందించిన నాచులతో ప్రకాశించే మణిమను ప్రదేశాలు చూచి అవి నీటిమడుగు లని – స్పటిక పురాళ్ళగోడల కాంతులు కప్పటంచేత వీళ్ళుండే చోట్లను చూచి సీళ్ళులేనిచో ట్లనీ – జనులు డ్రమపడేటట్లుగా మయుడు సభను నిర్మించాడు.
ఇక చదవండి….
Sabhaparvam Download PDF Book
Read Sabhaparvam online here.
maha-bharatham-vol-3-sabha-parvamFollow us on Social Media
Thank you very much for such a valuable and great books…