Mahabharatam-Aranyaparvam1(vol-4)
అరణ్యపర్వం
Aranyaparvam
‘రాచబిడ్డ లై ప్రజానురంజకంగా తమ రాజ్యభాగాన్ని ఏలుకొంటున్న పాండవులను జూదానికి పిలిచి అన్యాయంగా ఓడించి, అరణ్యాలకు పంపటం నిర్దయ చిత్తులైన దుర్యోధన ధృతరాష్ట్రుడు తగునా?
పిసినిగొట్టువాడైన దుర్యోధనుడు, తనకు అనుగు చెలికాండ్రయిన కర్ణుడు, సైంధవుడు, శకుని తో కాగా, రాజ్యం ఏలుతుంటే- ఆతడి రాజ్యంలో మే మెట్ల బ్రతుకగలం? ఈ భువి పై ఇక ఏది ధర్మం? పాండవు వెళ్ళే చోటికే మేము కూడ వెళ్ళటం మంచిది- అని నిశ్చయించుకొన్న పౌరులు పాండవులతో (ఇట్లా అన్నారు ఓ వీరులారా! మమ్మల్ని విడిచి వెళ్ళటం మీకు న్యాయం కాదు. మాకు వేరే దిక్కులేదు. దుర్జన సహవాసం మంచివారికి కూడా పాపం సంప్రాప్తిస్తుందనటంలో సందేహం లేదు.
‘మీరు సాధువులు మెచ్చుకొనే సద్గుణాలు కలవారుగా పేరుకెక్కినవారు. మీ సాహచర్యం వలన ధర్మాత్ములమై ధన్యులం కాగలం. చెడ్డపనులకు ఉపక్రమించనివారుకూడ దుర్జన సాంగత్యంచేత ధర్మ భ్ర్టులవు కావున మాకు దుర్యోధనుడి రాజ్యంలో నివసించటానికి ఇష్టం లేదు. అందుచేత మీతో పాటు రావటానికి అనుమతిని ఇవ్వాలని పౌరులు నమస్కరించి పలుకగా, వారితో ధర్మరాజు ఈ విధంగా ప్రత్యుత్తర ఇచ్చాడు.
ఈ విధంగా తమతో అరణ్యవాసం చేయటానికి సంసిద్ధులై వచ్చిన బ్రాహ్మణులను అనురాగంతో మన్ననతో పూజించి, వారి ఆశీర్వాదాలను పొంది ధర్మరాజు వారితో ఇట్లా అన్నాడు.
మీరు రావటం ఎందుకు ? వచ్చి ఎందుకు కష్టపడాలి? మీరు మీ ఇండ్లకు తిరిగిపొండి. భీకరమైన ఏనుగులతో, పెద్దపులులతో కూడిన అరణ్యవాసం మీకు తగునా?”
రుచిగా, శుచిగా ఉన్న వంటకాలతో ఎల్లప్పుడూ తృప్తిగా భుజించే బ్రాహ్మణోత్తములు కేవలం కూరగాయలు తింటూ అరణ్యంలో ఉండటం ఎలా చూడగలను ధర్మరాజు వాపోయాడు.
మా పోషణగురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. మేమే అడవిలో దొరికే పండ్లు, వేర్లు
తెచ్చుకొని తినగలం. జపతపాలు, యజ్ఞయాగాలు మొదలైన పుణ్యకార్యాలు నిర్వహించి మీకు ప్రియం చేస్తూ ఉంటాం. మీకు కీడు చేసిన దుర్యోధనాదులు పరిపాలించే దేశంలో మేము ఉండలేం’ అని చెప్పిన బ్రాహ్మణుల మాటలకు సమ్మతించారు.
ఇక చదవండి….
Aranya Parvam Download PDF Book
Read Aranya Parvam online here
maha-bharatham-vol-4-aranya-parvam-p-1Follow us on Social Media