Linga Puranam in Telugu PDF
లింగపురాణం
శివలింగచరిత్రం గురించి వివరించటం జరిగింది (లింగస్య చరిత్రోక్తత్వాత్ పురాణం లింగముచ్యతే) కాబట్టి దీనిపేరు లింగపురాణం అయిందని శివపురాణం పేర్కొంటున్నది. వివిధ పురాణాలలో లింగోద్భవం గురించి చెప్పిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. ఈశానుకల్ప వృత్తాంత ప్రసంగం బ్రహ్మచేత చెప్పబడిందని ఈ పురాణంలో ఉన్నదని స్వయంగా లింగపురాణమే తెల్పుతున్నది. కానీ మత్స్య , నారద పురాణాలను అనుసరించి అగ్నికల్పంలోని కథావృత్తాంతం లింగపురాణంలో చోటుచేసుకోవాలి. ఈశానుకల్ప వృత్తాంతాలు అగ్నిపురాణంలో ఉన్నాయి. ఇందులో శివకేశవుల వృత్తాంతాలు వర్ణింప బడినా, ఏక్కడా అన్యదేవతా నింద కనిపించదు.
లింగపురాణంలో శివలింగపూజా వర్ణన హృదయంగమంగా చెప్పబడింది. శివుని ద్వారా సృష్టి ఆవిర్భావం చెందిందని, శివుని 28 అవతారాల వృత్తాంతము, శివసంబంధ మైన అనేక వ్రతాలు, తీర్థాలకు సంబంధించిన విశేషాలు ఇందులో ఉన్నాయి. ఇందులో శైవ దర్శనాలకు అనుకూలమైన పశు, పాశ అలాగే పశుపతి శబ్దాల వివేచనాత్మక వ్యాఖ్య కనిపిస్తుంది. లింగోపాసన యొక్క ఆవిర్భావము చాలా చక్కగా విశకరించబడింది. శివతత్త్వమీమాంస అధ్యేతలకు చాలా ఉపయోగకరమైనది ఈ పురాణం.
స్కాందపురాణంలోని రేవాఖండం, భాగవతం, మత్స్య నారదపురాణాలు, బ్రహ్మ వైవర్త పురాణానుసారం ఇది పురాణాలలో 11వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. దీనిలో పదకొండు వేల శ్లోకాలున్నాయి. హలాయుధుడు తన ఒక గ్రంథంలో బ్రహ్మలింగపురాణాన్ని ఒకదాని నుంచి ఒకవచనాన్ని ఉద్ధరించాడు. కానీ అలాంటి పురాణమేదీ లభించలేదు. ఇదికాకుండా వసిష్ఠ లింగపురాణం ఒకటి లభిస్తున్నది. ఈ పురాణంలో శివుడిని లింగరూపంలో ఆరాధించే విధానాలు చెప్పబడ్డాయి. ఇందులో శైవదర్శనానికి ముఖ్యంగా పాశుపత సిద్ధాంతానికి సంబంధించిన అనేక విషయాలు ప్రతిపాదించబడ్డాయి. అష్టమూర్తియైన శివునికి ఎనిమిది మూర్తులకూ ఎనిమిది వైదిక నామధేయాలు చెప్పబడ్డాయి. అవి : పృధ్వీమూర్తి – శర్వుడు; జలమూర్తి = భవుడు; అగ్నిమూర్తి = పశుపతి, వాయుమూర్తి = ఈశానుడు; ఆకాశమూర్తి = భీముడు; సూర్యమూర్తి = రుద్రుడు; సోమమూర్తి = మహా దేవుడు; యజమానమూర్తి = ఉగ్రుడు అనేవి. ప్రత్యేకమూర్తికి భార్యా, ఒక పుత్రుడు చెప్పబడ్డారు.
బౌద్ధధర్మ ప్రాబల్యం తగ్గి, బ్రాహ్మణధర్మం అభివృద్ధి పొందుతున్న సమయంలో ఈ పురాణం కొంత సంస్కారం జరిగినట్లు భావించటానికి అవకాశం ఉన్నది. అప్పుడు అగ్ని పురాణంలో చెప్పినట్లు ఈశాన కల్పవృత్తాంతం ఇందులో చేరి ఉంటుందని భావించటానికి అవకాశం ఉన్నది. ఈ లింగపురాణంలో అగ్నికల్ప వృత్తాంతం అని స్పష్టంగా లేకపోయినప్పటికీ, ఇందులో ప్రతిపాదించిన విషయాలతోపాటు అగ్నిమయ లింగ వివరణ కూడా ఉన్నందువలన అలా భావించవలసివస్తున్నది.
సంప్రదాయజ్ఞుల చేతివాటంతో ఇందులో కొన్ని ప్రక్షిప్తాలుగా చేరిన శ్లోకాలను తీసివేసినట్లైతే లింగపురాణ ప్రాచీన రూపం కంటికి కట్టకలదు. ఇందులో ఉండే వివిధ వృత్తాంతాలను విడివిడిగా మార్చి అరుణాచల మాహాత్మ్యం, పంచాక్షర మాహాత్మ్యం, రుద్రాక్ష మాహాత్మ్యం, రామసహస్రనామం వంటి విడి పుస్తకాలుగా కూర్చడం జరిగింది. అనేక బాహ్య ఆంతరంగిక ప్రమాణాలను బట్టి ఈ పురాణం అష్టమ నవమ శతాబ్దాలకు సంబంధించి ఉంటుందని విమర్శకుల అభిప్రాయం. దానసాగరం అనే ఇంకొక స్మృతి గ్రంథాన్ని బట్టి ఆరువేల శ్లోకాలుగల ఇంకొక లింగ పురాణం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదే వసిష్టలింగ పురాణమేమో.
లింగ పురాణం 1. పూర్వభాగం 2. ఉత్తరభాగమనే రెండు విభాగాలుగా చేయబడింది. అందులో పూర్వభాగంలో 108 అధ్యాయాలు, ఉత్తర భాగంలో 55 అధ్యాయాలు మొత్తం 163 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలోని మొత్తం శ్లోకాల సంఖ్య 11 వేలు.
Linga puranam in Telugu PDF
Linga puranam is one of Asthadasa puranalu (18 puranas of sanatana dharma). This lnga puranam was preached by Mahrshi veda vyasa. The book is in very easy to read Telugu language.
Read , GET Linga puranam in Telugu here
Follow us on Social Media