Kurma puranam in Telugu PDF
అష్టాదశ పురాణాలలో పదిహేనో పురాణం శ్రీ కూర్మ మహాపురాణం. దీనిని విష్ణువు పులస్త్య మహామునికి బోధించాడు. ‘కూర్మం పృష్ఠం సమాఖ్యాతం’ అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి పృష్ఠ భాగంగా వర్ణించబడింది. ఈ పురాణంలో మొత్తం 17వేల శ్లోకాలున్నాయి. పూర్వార్ధం, ఉత్తరార్ధాలుగా ఈ పురాణం విభాగించబడింది. పూర్వార్ధంలో 53 అధ్యాయాలు ఉండగా ఉత్తరార్ధంలో 44 అధ్యాయాలున్నాయి. కూర్మ రూపంలో ఉన్న మహావిష్ణువు ఇంద్రుడి సమక్షంలో మహర్షులందరికీ ఉపదేశించిన పురాణం ఇది.
లక్ష్మీ కల్పంలో ఈ కూర్మ పురాణం 24,000 శ్లోకాలతో ఉండేది. నారద పురాణం ప్రాచీన కూర్మ పురాణం గురించి చెబుతూ – ఇందులో
- బ్రాహ్మీ సంహిత
- భాగవతీ సంహిత
- సౌర సంహిత
- వైష్ణవీ సంహిత అని నాలుగు విభాగాలున్నాయి.
మొత్తం ఈ సంహితల్లో ఉన్న శ్లోకాల సంఖ్య 17000. అయితే ప్రస్తుతం ఈ పురాణంలోని మొదటి బ్రాహ్మీ సంహిత తప్ప మిగిలిన సంహితలు దొరకటం లేదు.
శ్రీ కూర్మ మహా పురాణంలో చెప్పిన విషయాలు
పూర్వార్ధం 1 – 25 అధ్యాయాలు: వీటిలో ఇంద్రద్యుమ్నుడి మోక్ష ప్రాప్తి, వర్ణాశ్రమ విశేషాలు, వర్ణాశ్రమ క్రమం, ప్రాకృతసర్గ, పృథివి ఉద్ధారం, సృష్టి విశేషాలు, ముఖ్యాదిసర్గ కథనం, పద్మోద్భవుడి ప్రాదుర్భావం, రుద్ర సృష్టి, దేవీ అవతారాలు, దేవీ మహాత్మ్యం, దక్షకన్యాఖ్యాతి, రాజవంశాను కీర్తనం, దక్షయజ్ఞ విధ్వంసం, దక్షకన్యా వంశ కథనం, త్రివిక్రముడి చరిత్ర, వంశాను కీర్తనం, ఋషివంశం వర్ణన, రాజవంశాల వివరాలు, ఇక్ష్వాకు వంశ చరిత్ర, సోమ వంశ చరిత్ర, యదువంశ చరిత్ర, యదువంశంలో శ్రీకృష్ణుడి కీర్తి ప్రతిష్ఠలు లాంటి విషయాలు వర్ణించబడ్డాయి.
26 – 53 అధ్యాయాలు: వీటిలో శంకరుడి కీర్తి వర్ణన, రాజ వంశాను కీర్తనం, పార్థుడికి వ్యాస దర్శనం కలగటం, యుగ వంశాను కీర్తనం, యుగ ధర్మ నిరూపణం, వారణాసి క్షేత్రమాహాత్మ్యం, ప్రయోగ క్షేత్రమాహాత్మ్యం, భువన విన్యాసం, జ్యోతిస్సన్నివేశ వర్ణన, భువనకోశ వర్ణన, పర్వతాల సంఖ్య, జంబూద్వీప వర్ణన, విష్ణు మాహాత్మ్యం, వేద శాఖలు, మన్వంతరాలు వంటి విషయాలు వివరంగా చెప్పబడ్డాయి.
ఉత్తరార్ధం 1 – 25 అధ్యాయాలు: వీటిలో ఈశ్వరగీత, ఋషి-వ్యాస సంవాదం, ఈశ్వర-ఋషి సంవాదం, వ్యాస మహర్షి చేసిన ధర్మోపదేశాలు, వేద జ్ఞానం ప్రాప్తించే విధానం, విప్రుల ధర్మాధ్యాయం, బ్రాహ్మణులు ఆచరించాల్సిన నిత్య కర్మలు, శ్రాద్ధ కల్పం, శ్రాద్ధానికి యోగ్యత, అయోగ్యత వివరణ, శ్రాద్ధధర్మ విశేషాలు, గృహస్థుల శ్రాద్ధ నియమాలు, బ్రాహ్మణ ధర్మాలు, గృహస్థులు ఆచరించాల్సిన ధర్మాలు వంటి విశేషాలు వివరించబడ్డాయి.
26 – 44 అధ్యాయాలు: వీటిలో దానం చేసేడప్పుడు పాటించాల్సిన నియమాలు, వానప్రస్థులు ఆచరించాల్సిన ధర్మాలు, సన్న్యాసి పాటించాల్సిన ధర్మాలు, వివిధ రకాల ప్రాయశ్చిత్త విధానాలు, కాపాలమోచన తీర్థ మహిమ, పుణ్య తీర్థాలు – వాటి ప్రాశస్త్యం, ప్రళయ వర్ణన లాంటి ఎన్నో విషయాలు సవివరంగా చెప్పబడ్డాయి.
ఈ పురాణం చదివినా, విన్నా చతుర్వర్గ ఫలాలు సిధ్ధిస్తాయి. సర్వోత్కృష్టగతి కూడా కలుగుతుంది.
Kurma puranam is one of the vishnu puranas. Also one amoung asthadasa puranalu (18 puranas). Kurmavatara incidents and other kurma avatara related content found in this kurma puranam.
Read, Kurma puranam in Telugu here:
Follow us on Social Media