Katyayani-devi

Katyayani Devi

Katyayani devi

కాత్యాయనిదేవి

నవరాత్రుల్లో ఆరవరోజు అమ్మవారిని కాత్యాయనిదేవిగా పూజిస్తారు.
పూర్వం కాత్యాయన అనే మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి ఆదిపరాశక్తి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అమ్మవారే తన కుమార్తెగా జన్మించాలని వరం కోరుకుంటాడు.

https://youtu.be/arbQ-YSlBVE?rel=0

మరొక పక్క మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుని గురించి కఠోర తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు మృత్యువు లేకుండా వరం ఇవ్వడం కుదరదు ఇంకేమైనా కోరుకోమంటాడు. అందుకు మహిషాసురుడు కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణం పొందేలా వరం పొందుతాడు. స్త్రీలు బలహీనులుగా, కేవలం బానిసలుగా చూసే మహిషాసురుడు ఇక తనకు మరణంలేదని, వర గర్వంతో సమస్తలోకాలను పీడిస్తూ ఉంటాడు. మహిషాసురుడి ఆగడాలు భరించలేక సమస్త దేవతలు కలిసి త్రిమూర్తులను శరణువేడుతారు.

మహిషాసురుడి జననం: ఒకానొకప్పుడు రంభసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. ఒకసారి మహిషిని చూసి మోహించి వివాహమాడతాడు,వారి సంతానమే మహిషాసురుడు. మహిషాసురుడు మనిషిలా, మహిషిల మారగల శక్తి ఉన్నవాడు.

మహిషాసుర సంహారం కోసం అమ్మవారు కాత్యాయన మహర్షి ఇంట జన్మిస్తుంది. కాత్యాయన మహర్షిని తండ్రిగా స్వీకరించింది, కనుక కాత్యాయని అనే నామంతో అమ్మవారిని పిలుస్తారు.
ఒక రోజు చండ్, ముండ్ అనే ఇద్దరు రాక్షసులు అత్యంత సౌందర్యరాశి అయిన, వెలిగిపోతున్న కాత్యాయనీ దేవిని చూసి, ఆమె అందానికి అచ్చెరువునొంది, ఆమె సౌందర్యం గురించి వాళ్ల రాజు అయిన మహిషాసురుడికి చెప్తారు. వెంటనే మహిషాసురుడు దుందుభి అనే దూతను కాత్యాయనిదేవి వద్దకు వివాహ ప్రస్తావన పంపుతాడు. దుందుభి ఎలాగైనా ప్రలోభపెట్టి ఆ స్త్రీని వివాహానికి ఒప్పించాలని తమ రాజు గురించి, త్రిలోకాధిపత్యం గురించి, ఇంకా అతని ఐశ్వర్యం గురించి చాలా గొప్పగా చెబుతాడు.

అప్పుడు కాత్యాయనిదేవి నవ్వి మా వంశం లో ఒక ఆచారం ఉంది, ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వారిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. ఆ సమాచారాన్ని దుందుభి మహిషాసురుడు కి చెప్తాడు. ఇక మహిషాసురుడు స్త్రీ కింత అహంకారమా, స్త్రీని జయించడం ఎంతసేపు, యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్తాడు.

మహిషాసుర, కాత్యాయనిదేవి యుద్ధం గురించి తెలుసుకున్న దేవతలు దేవ సైన్యాన్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి వస్తారు. ఈ అవతారంలో అమ్మ 18 చేతులతో, మూడు నేత్రాలతో, వేయి సూర్య కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. దేవతలు తమ తమ ఆయుధాలను కూడా అమ్మవారికి ప్రసాదిస్తారు. విష్ణుమూర్తి తన చక్రాన్ని, శివుడు తన త్రిశూలాన్ని, వరుణదేవుడు శంఖాన్ని, వాయువు విల్లుని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, బ్రహ్మదేవుడు కలశాన్ని, కమలాన్ని ఇలా వివిధ ఆయుధాలను ఇస్తారు. అమ్మవారు సింహవాహినియై, దేవ సైన్యం వెంటరాగా మహిషాసురుడితో యుద్ధానికి తరలి వెళుతుంది.

మొదట దుందుభి తర్వాత చండ్, ముండ్, శుంభ నిశుంభలను వధించగా, ఇక మహిషాసురుడే యుద్ధానికి వస్తాడు. మహిషిగా, అసురుడిగా రూపాలను మారుస్తూ అమ్మవారి తో యుద్ధం చేస్తాడు. మహిషిగా మారినప్పుడు అమ్మ, వాడి పృష్టభాగం అధిరోహించి త్రిశూలం తో పొడిచి కత్తితో తల నరికివేస్తుంది. మహిషాసురుని వధించింది కనుక అమ్మవారిని మహిషాసురమర్దిని అనే నామంతో కూడా పూజిస్తారు. చాలా ప్రాంతాలలో అమ్మవారి విజయానికి ప్రతీకగా దుర్గా పూజ చేస్తుంటారు.

కాత్యాయని దేవి ఉపాసన వల్ల సాధకులకు ఆరవ చక్రం అనగా ఆజ్ఞా చక్రం ఉత్తేజితమవుతుంది. ఆజ్ఞా చక్రం ఉత్తేజితం అవ్వడం వల్ల సాధకుల లో నిక్షిప్తం అయి ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది.

ద్వాపరయుగంలో గోకులంలోని గోపికలంతా కృష్ణుని భర్తగా పొందడం కోసం కాత్యాయని దేవి వ్రతం చేస్తారు. పెళ్ళికాని కన్యలు మార్గశిర మాసంలో వ్రత నియమాలను అనుసరించి కాత్యాయని వ్రతం చేసుకుంటే మంచి భర్త లభిస్తాడని ప్రతీతి.

ప్రార్థన:

చన్ద్రహసోజ్జ్వలకర శార్ధూల వరవాహన
కత్యయని సుభమ్ దద్యాద్ దేవి దానవఘాటిని

స్తుతి:

యా దేవీ సర్వభూ‍తేషు మాఁ కాత్యాయనీ రూపేణ సంస్థితా।
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః॥

వివాహానికి సంబంధించిన సమస్యల నివారణ కొరకు సూచించబడిన కాత్యాయని దేవీ మంత్రాలు:

ముందస్తు వివాహం కొరకు:

ఓం కాత్యాయనీ మహామాయే, మహాయోగిన్యాధీశ్వరీ।
నాంద్ గోప్సూతత్ దేవి పాటిమ్ మే కురు తే నమః॥
1

వివాహ ఆలస్యం అవుతుంటే పఠించాల్సిన మంత్రం:

హే గౌరీ! శంకర్అర్ధాంగి! యధా త్వాం శంకర ప్రియా।
తథా మమ కురు కల్యాణి కంటకం సుదుర్లభం॥
2

వివాహానంతర సమస్యల నివారణకు:

హే గౌరీ! శంకర్అర్ధంగిని! యథా త్వం శంకర ప్రియ।
తథా కమ్ కురు కల్యాణి కంత్ కాంత్ సుదుర్లభమ్॥
3

కాత్యాయనీ సూర్య మంత్రం – ఆలస్యం అయిన వివాహాల కోసం మరియు కోరుకున్న భాగస్వామి కోసం:

ఓం దేవేంద్రని నమస్తుభ్యం! దేవేంద్ర ప్రియ భీమిని।
వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే॥
4

మంచి వైవాహిక జీవితం కొరకు:

ఓం షంగ్శంకరాయ సకల్జన్మర్జీత్ పాప్విధ్వామ్స్నాయ్।
పురుషార్ద్చౌతుస్టాయ్ లాభయ్చ పాటిమ్ మే దేహి కురు కురు స్వాహ॥
5

***

*** శ్రీ మాత్రే నమః ***

Follow us on Social Media