Mahabharatam-Karna parvam(vol-10)
కర్ణ పర్వం
స్వామీ! వైశంపాయన మహర్షి, జనమేజయ మహారాజుతో ఇట్లా చెప్పాడు. రాజా! నీ కిదివరకే నేను
చెప్పినట్లు గొప్ప జ్ఞాని అయిన సంజయుడు కురుక్షేత్రంలో ఉన్న సైన్యం నుంచి బయలుదేరి రాజధాని హస్తినానగరానికి వచ్చాడు. ధృతరాష్ట్ర మహారాజు నివసించే భవనానికి వెళ్ళి ఆ మహారాజును దర్శించి నమస్కరించాడు. ఆయన అతడిని మన్నన చేసి కూర్చోమంటే కూర్చొని
ధృతరాష్ట్ర మహారాజా! తమ శక్తి, శౌర్యమూ అందరూ మెచ్చుకొనేటట్లు మనసైన్యమూ పాండవుల సేవా
చేస్తున్న యుద్ధం రెండు రోజులు స్పష్టంగా చూసి
కర్ణుడు పాండవుల సైన్యాన్ని పిసరంతైనా లక్ష్య పెట్టి సేన ఒకప్పుడు చెల్లాచెదరైపోయింది. ఇంకొకప్పుడు మళ్ళీ వెనక్కు వచ్చింది. మరొకప్పుడు పడిపోయింది. వేరొకప్పుడు ప్రాణాలు కోల్పోయింది. కొంత అన్నివైపులా పారిపోయింది. అది చూచే ఆకాశసంచారులయిన దేవతలు మొదలయిన వారికి వినోదం కలిగించింది. అట్లా అతడు విజృంభించి తనబాహుబలమూ, పరాక్రమమూ ప్రదర్శించాడు.
ఆ పాండవులను కలత పెట్టి, అవలీలగా యుద్ధంచేసి, ఆ తర్వాత
ధృతరాష్ట్ర మహారాజా! తన కంటె అధికుడైన అర్జునుడి బాహుబలాన్ని ఏ విధంగానూ అతిశయించలేక పెద్దపులి వశమైన ఆబోతు వలె కర్ణుడు మరణించాడు. దానితో పాండవుల పగకూడ చల్లారింది.
ఇక చదవండి……..
Karna Parvam Download PDF Book
maha-bharatham-vol-10-karna-parvamFollow us on Social Media