drona parvam

Mahabharatam-Drona Parvam(vol-9)

ద్రోణపర్వం

వ్యాసమహర్షి అనుగ్రహం వలన కౌరవ పాండవ శిబిరంలో విశేషాలన్నీ తెలిసికొని, ఒకనాటి రాత్రి సంజయుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు.అపుడు ఆ రాజు అతడిని దగ్గరికి తీసికొని ఆదరించి,
అయ్యో సంజయా! యుద్ధ రంగంలో భీష్ముడిని కోల్పోయిన కౌరవ వర్గం మళ్లీ ఎవ్వరిని సేనాపతిగా నియమించి, పరాక్రమంలో సాటిలేని పాండవ సైన్యాన్ని ఎదుర్కొనవలెనని అనుకొన్నది? చెదరిపోయిన సైన్యాన్ని ఎలా సమీకరించారు.
కౌరవులు అపుడు ఒకచోటికి ఎట్లా కూర్చుకొన్నారు? తెలుపవలసింది.
సైన్య శిబిరాలకు యుద్దనన్నాహాన్ని తెలిపే విప్పాణాది వాద్యాలు ఒక్క పెట్టున మ్రోయగా, గజాది చతురంగ బలాలు క్రమబద్ధంగా వేర్పాటు ముందుకు సాగటానికి ప్రయత్నిస్తుండగా, తెల్లముఖాలు వేసిన కరువు, వీరుల వస్త్కవచాద్యలంకారాల కదలికలతో చలించే రూపాలు కలవారయ్యారు.
ధృతరాష్ట్ర మహారాజా! ఆకలితో ప్రియుడిని మింగిన తోడేళ్ళగుంపు వేగంగా తనను చుట్టుముట్టగా
భయంతో వణకుతూ దిక్కులు చూస్తున్న ఆడజింకవలె నీ పుత్రుడి సైన్యం, భీష్ముడు యుద్ధంలో కూలనేసి
విజృంభించిన పాండవుల పరాక్రమాన్ని చూచి బెదిరిపోయింది.

జ్ఞానులలో శ్రేష్ఠుడైన భీష్ముడు లేని మన సేన వైదవ్యం పొందిన స్త్రీ వలెను, కాపరిలేని ఆవుల పంటలు లేని పొలం వలెను, సింహం లేని పర్వత గుహ వలెను నా మనసుకు తోచింది.
ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు ‘కర్ణా! ఓ కర్ణా! మేమంతా దిక్కులేని వారం అ వచ్చి కాపాడు’ అనే ఆర్తనాదాలు స్పష్టంగా సైన్యంలో అంతటా వ్యాపించాయి.
‘కర్ణుడు బలపరాక్రమశాలి, ఆలస్యం చేయక అతడిని యుద్ధం చేయటానికి ఆహ్వానించండి. భీష్ముని మాటలకు అలిగి ఆయన యుద్ధరంగంలో ఉన్నంత వరకు ఆ పదిరోజులు తాను బంధుమిత్రులతో కలిసి యుద్ధానికి రాలేదు కదా.

ఇంద్రియనిగ్రహం, సత్యవాక్పరిపాలన, తపస్సు, దాతృత్వం, సత్ప్రవర్తన, అస్త్రాలను ప్రయోగించే మర్థ్యం వంటి సద్గుణాలు ఒక్క భీష్ముడిలోనే ఉన్నవి. అటువంటి మహనీయుడు యుద్ధంలో కూలిపోయాడు ఇక మీకు బాహుబలగర్వం ఎక్కడ? ఎక్కడి సేనలు? అయ్యో! కౌరవేశ్వరుడైన దుర్యోధనుడి ఐశ్వర్యం నశించిoది! అని కర్ణుడు భీష్ముడు తలచుకొని విచార గ్రస్తుడు అయినాడు.

ఇక చదవండి…..

Drona Parvam  Download PDF Book   

Read Drona Parvam online here.

maha-bharatham-vol-9-drona-parva
Follow us on Social Media