Sandhya Vandanam in Telugu

Sandhya Vandanam in Telugu

Yajurveda Sandhyavandanam in Telugu

Get Yajurveda Sandhya Vandanam in Telugu PDF online. Sandhya Vandanam complete guide – When to do, where to do, how to do Sandhya Vandanam.

సంధ్యావందనం

శ్రీ శివాయ గురవేనమః

జంతూనాం నరజన్మదుర్లభం……” జీవులలో మానవజన్మదుర్లభము.

వివేకచూడామణి ఆది శంకరులు.

“నృదేహమాద్యం సులభం సుదుర్లభం……” మొదట ఈ మనుష్య దేహము మనకు లభించినదిగాన సులభమని భావించుదురు. కాని ఈ మనుష్య దేహము మరల పొందుట మిక్కిలి శ్రీమద్భాగవతము 11వ స్కంధము,

ఇత్యాది వచనములను బట్టి మానవజన్మ అత్యంత శ్రేష్ఠమని తెలియుచున్నది. ఈ మానవజన్మలో మరింత ఉత్కృష్టమైనది బ్రాహ్మణత్వము. ఈ ధర్మము విద్యా, సంస్కార, సద్గుణములచే సిద్ధించును. మనుస్మృతిలో బ్రాహ్మణత్వము జన్మచేత, ఉపనయన సంస్కారముచేత ద్విజత్వము, ఆర్షవిద్యను అధ్యయనము చేయుటచే విప్రత్వము, ఈ మూడును స్థిరముగా పొందుటచే శ్రోత్రియత్వము సిద్ధించునని

జన్మనాబ్రాహ్మణోజ్ఞేయః, సంస్కారాత్ ద్విజ

విద్యయా యావితం త్రిభిఃశ్రోత్రియ ఉచ్యతే॥

అని చెప్పబడినది. “ఉపనయన సంస్కారము కలిగినవానికి సంధ్యోపాసన లేక సంధ్యావందనము, నిత్యవిహితము తప్పనిసరిగా ఆచరింపవలెను. “ద్విజత్వం విధ్యనుష్ఠానాత్” శాస్త్రోక్తమైన విధిని ఆచరించినందుకే బ్రాహ్మణునకు ద్విజత్వము సిద్ధించునని ఆదిశంకరులు చెప్పిరి. ఈ “సంధ్యావందనము”ను ఆచరించుట అతికొద్ది సమయములో చేయవచ్చును. కలికాల ప్రభావముచే నేటి బ్రాహ్మణ యువత కొంతమంది దీనిని విస్మరించి అర్ధమే పరమార్ధమని పరమార్ధమును వ్యర్ధమని భావించి స్వధర్మాచరణకు దూరమగుచున్నారు. దేశాంతరములందు ఖండాంతరములందున్న యువకులు ఆసక్తిగల ద్విజకుమారులకు ఇక్కడివారికిని ఈ “సంధ్యావందన” పుస్తకము ఉపయోగించును అను తలంపుతో మాన్యులు శ్రీ టి.ఎన్.శాస్త్రిగారు వారి కుటుంబసభ్యులు ఈ “సంధ్యావందన” గ్రంథమును ముద్రింపజేసిరి. వందలో ఏ పదిమంది ఈ కర్మను ఆచరించిననూ వీరి ఈ ప్రయత్నము సఫలమగును. ద్విజబృంద నిషేవితయగు సంధ్యాదేవత, గాయత్రీమాత, పరివార సమేతులైన శ్రీ శాస్త్రిగారిని ఎల్లవేళల రక్షించునుగాక అని సద్గురు పరదేవతా స్మరణపూర్వకముగా తెలియజేయుచున్నాను.

Yajurveda Sandhya Vandanam in Telugu Pdf

Yajurveda-Sandhyavandanam

Sandhya Vandanam in Telugu Download Here.      Download PDF Book 

 

Follow us on Social Media