Valmiki Ramayanam-Kishkinda kanda

కిష్కింద కాండ
Kishkinda kanda

రామ లక్ష్మణులు పంపా సరస్సు సమీపించారు. ఆ సరస్సు చూడటానికి చాలా మనోహరంగా ఉంది. సరస్సు నిండా పద్మములు,కలువలు వికసించి ఉన్నాయి. ఆ సరస్సు అందాలు చూడగానే రాముని హృదయం అంతా బాధతో నిండి పోయింది.
లక్ష్మణా! ఆ కోయిలలు చూడు ఎలా కూస్తున్నాయో. సీత కూడా ఆ కోయిల కూతలు విని నన్ను పిలిచి ఆ కోయిల కూతలు నాకూ వినిపించేది. నా సీత నాకు దొరకని పక్షంలో, నా సీతను నేను చూడని పక్షంలో నేను బతికి ఉండటం వృధా! ఇటువంటి సుందర ద్య్రశ్యాలు ఎన్ని చూచినా సీతను చూచిన దానితో సాటి రావు కదా పైగా ఈ వసంత బుతువు దృశ్యములు,

ఈ మలయమారుతము వసంత శోభ నా వ్యధను ఎక్కువ చేస్తున్నాయి. నా సీతను ఆ రాక్షసుడు ఎత్తుకొని పోకపోయి ఉంటే నేను కూడా సీత తో కలిసి ఈ వసంత ఋతువు శోభను తనివిదీరా అనుభవించేవాడిని కదాలక్ష్మణా! సీత బతికి ఉంటే, సీత ఉన్న చోటున కూడా ఈ వసంత ఋతువు ఉంటుంది కదా! సీత కూడా నీ మాదిరే విరహవేదన అనుభవిస్తూ ఉంటుంది కదా! నా మాదిరే సీత కూడా ఈ వసంత శోభను అనుభవించలేదు కదా!

అవును. ఈ మనోహర దృశ్యాలు ఆమెకు కూడా ఏమాత్రం ఆనందాన్ని కలిగించలేవు. ఎందుకంటే నేను సీత దేహాలు వేరైనా మా మనసులు ఒకటే. నా మనస్సు ఆమె మీద ఆమె మనస్సు నీ మీద లగ్నం అయి ఉన్నాయి.లక్ష్మణా! నేను సీత కలిసి ఉన్నప్పుడు మా ఇద్దరికీ ఆహ్లాదమును కలిగించిన ఈ మలయమారుతము ప్రస్తుతం నాకు అగ్ని వీచికలవలె తాకుతూ ఉన్నాయి.

లక్ష్మణా! చూచావా! ఆ కాకి ఎలా అరుస్తూ ఉందో! నాకు మరలా సీతా సంయోగం కలుగుతుందని చెబుతూ ఉన్నట్టు లేదూ! సీతకు పద్మములు అంటే ఎంతో ఇష్టం. ఈ పంపా సరోవరములో ఉన్న పద్మములను చూచి సీత ఎంత సంతోషించేదో కదా! సీత లేకుండా నేను ఈ పద్మముల శోభను అనుభవించలేక ఉన్నాను.

లక్ష్మణా సీత నా దగ్గరగా ఉన్నప్పుడు నాకు ఏ యే వస్తువులు, దృశ్యములు ఆనందాన్ని కలిగించాయో అవే వస్తువులు,అవే దృశ్యాలు ఇప్పుడు నాకు భేదాన్ని కలిగిస్తున్నాయి. లక్ష్మణా! సీత నాకు కనపడితే, సీతతో సహా నేను ఇక్కడ స్థిరనివాసము ఏర్పరచు కొనవలెనని కోరికగా ఉంది. సీతతో సహా ఇక్కడ ఉంటే, నాకు ఏ పదవి కూడా అక్కరలేదు అనిపిస్తూ ఉంది.

ఇక చదవండి…….

Valmiki Ramayanam – Kishkinda kanda

Download PDF Book

Read Valmiki Ramayanam-Kishkinda Kanda online here.

Valmiki-Ramayanamu-kishkinda-kanda

Follow us on Social Media