sunadara kanda

Valmiki Ramayanam – Sundara Kanda

సుందరకాండ

Sundarakanda

ఇప్పుడు మనము రామాయణంలో సుందర కాండములోకి ప్రవేశించబోతున్నాము. ఈ కాండ సుందర కాండ అని ఎందుకు అన్నారో చాలా మంది పండితులు రకరకాలుగా విశ్లేషించారు. వాటిని మీరు చదివే ఉంటారు. కాబట్టి మనం ఈ కాండమునకు సుందరకాండము అని ఎందుకు పేరు వచ్చింది అనే విషయం మీద చర్చిండం లేదు.
ఈ సుందర కాండము చాలామంది పారాయణం చేస్తుంటారు. కొంత మంది స్వయంగా పారాయణం చేస్తారు.

ఇంకొంత మంది పండితుల చేత పారాయణం చేయించి వింటూఉంటారు. కాని మనం స్వంతంగా పారాయణం చేస్తే వచ్చే ఫలితం వేరుగా ఉంటుంది.కాని సుందర కాండము వాల్మీకి సంస్కృతంలో శ్లోకరూపంలో రచించారు. పారాయణం చేస్తే శ్లోక రూపంలోనే చెయ్యాలి.సుందర కాండము మనము పారాయణం చేసి ఏమి నేర్చుకున్నాము. సుందర కాండము లో ఉన్నవిషయములను మనము నిజజీవితంలో ఎలా అమలు పరుస్తున్నారు అనేది ముఖ్యం కానీ యాంత్రికంగా పారాయణం చెయ్యడం కాదు.

కాబట్టి సుందర కాండములో మనకు ఉపయోగించే విషయాలు ఏమి ఉన్నాయి అనే విషయం చర్చించుకుందాము. మీరు సుందర కాండము చదువుతున్నప్పుడు ఈ క్రింది విషయాలు ఎక్కడెక్కడ పొందుపరచబడ్డాయి అనే విషయాన్ని మీరు అవగాహన చేసుకోవాలి. సుందర కాండము శ్రద్ధగా చదివితే మనకు కొన్ని విషయాలు ద్యోతకము అవుతాయి.

నిరాశా, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుణ్ణి చేస్తుంది సుందర కాండము.

మానసికంగా బలహీనమైన వాడిని మానసికంగా బలోపేతంచేస్తుంది సుందర కాండము.కేవలం పురుష ప్రయత్నం చాలదు. దైవయత్నం కూడా ఉండాలి అలాగని, కేవలం దైవ ప్రార్థన చాలదు. మానవ ప్రయత్నం కూడా ఉండాలి. పురుష ప్రయత్నము, దైవయత్నము కలిస్తేనే కార్యసిద్ధి కలుగుతుంది అని చాటి చెప్పినది సుందర కాండము.
మనకు బయట నుండి సాయం అందుతుంది అని మనకు తెలియజేసేది సుందర కాండము.

ఇక చదవండి……

Valmiki Ramayanam Sundarakanda

Download PDF Book

Read Valmiki Ramayanam Sundarakanda online here.

Valmiki-Ramayanamu-sundara-kanda

Follow us on Social Media