Vunnadi Okkate Brahmam

Vunnadi Brahmamokkate

Vunnadi Brahmamokkate

ఉన్నది బ్రహ్మమొక్కటే

గురుపరంపరను ఆరాధించటం ముందుగా మనం చేయవలసిన పని. వారి అమూల్యమైన బోధనలను మననం చేసుకోవటమే వారిని స్తుతించటం అవుతుంది. శ్రీ గురుగీతలో చెప్పినట్లు గురువే అన్నిటికి ఆది; గురువును మించిన తత్త్వం లేదు, తపస్సు లేదు జ్ఞానం లేదు; సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే స్వయంగా మనుష్య దేహంలోకి వచ్చి ‘గురువు’ అనే పేరును స్వీకరించి రహస్యంగా భూమి మీద తిరుగుతూ ఉంటాడు.”

కొందరి మాట మధురం. కొందరి చూపు కోమలం. కొందరి నైజం కరుణాపూరితం. కొందరి హృదయం ప్రేమమయం. కొందరి ప్రేమ నిస్వార్థం. కొందరి నడవడిక నిరాడంబరం. కొందరి పరిచయం అమూల్యం. కొందరి సాంగత్యం ఆహ్లాదకరం. ఈ లక్షణాలలో కొన్ని మాత్రమే కొందరిలో ఉండవచ్చు కాని అన్నీ రాశీభూతమై ఒక్కరిలో కనబడటం అసాధారణం. అటువంటి అసాధారణ మహామనీషి సద్గురు శ్రీ నాన్నగారు

యాభై సంవత్సరాలుగా రమణుడే నా జీవితానికి కేంద్రం. ఆయన జీవితమూ, బోధనలూ నన్ను చాలా ప్రభావితం చేసాయి. ఆయన నాకు లోచూపు అనుగ్రహించారు. సత్యాన్వేషకుడిగా నన్ను తీర్చిదిద్దారు” అని ఎంతో వినమ్రంగా పలికే భూపతిరాజు వెంకట లక్ష్మీ నరసింహరాజు గారిని ప్రేమతో భక్తులు “నాన్నగారు” అని పిలుస్తారు.

అక్షర జ్ఞానం లేని వారికి ఆధ్యాత్మిక విద్యను

అందించడమే నా గమ్యం” అంటూ నిరంతరం జ్ఞాన యజ్ఞాలు చేసే అలుపెరుగని కర్మయోగి సద్గురు శ్రీనాన్నగారు.

గత పది సంవత్సరాలుగా శ్రీనాన్నగారితో నాకు పరిచయం. ప్రథమ దర్శనంలోనే అనిర్వచనీయమైన శాంతిని పొందాను. ఆ తరువాత వారిని కలిసిన ప్రతిసారీ ఆ ప్రశాంతత పెరుగుతూ వచ్చింది. మెల్లమెల్లగా శ్రీనాన్నగారు చెబుతున్న మాటలను శ్రవణం చేస్తున్న కొద్దీ జిజ్ఞాస పెరిగింది.

మా ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా శ్రీనాన్నగారిని కోరిన కొంత కాలానికి ఎదురు చూసిన ఆ అమృత ఘడియలు వచ్చాయి. ఫిబ్రవరి 2010లో కొత్తగూడెంలో మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆనందపరవశుల్ని చెయ్యటమేకాక అమూల్యమైన వారి బోధనలతో అనుగ్రహించారు. అష్టావక్రుడు, జనకుడు శంకరులు మొదలైన జ్ఞానులు చెప్పినవి చదువుతున్నప్పుడు నాకు కలిగిన సందేహాలను వారి ముందుంచాను. ఒక జ్ఞాని ఆంతర్యాన్ని మరొక జ్ఞాని మాత్రమే బోధించగలడు కదా! ఆ మహాత్ముల బోధనలలోని అంతరార్థాన్ని సులభంగా అర్థమయ్యేటట్లు తమదైన విశిష్ట శైలిలో సద్గురు శ్రీనాన్నగారు బోధించారు. ఆ బోధనలకు అక్షర రూపమే ఈ పుస్తకం.

Vunnadi Brahmamokkate          Download PDF Book 

Read Vunnadi Brahmamokkate online here.

vunnadi-brahmamokkate

Follow us on Social Media