Valmiki Ramayanam Telugu
వాల్మీకి రామాయణం
Valmiki Ramayanam
ఈ ప్రపంచంలో తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు భార్య, సేవకుడు, ఆదర్శవంతంగా ఎలా ఉండాలో సవివరంగా తెలిపిన మహా కావ్యము రామాయణము. రామాయణములోని పాత్రలే మనకు ఆదర్శములు అనడంలో అతిశయోక్తి లేదు.
మీకు రామాయణం ఎంత బాగా తెలుసో? పరీక్షించుకోండి!
! Ramayanam Quiz !
రామాయణము అంటే రామ అయనము అనే రెండు పదాలు కలిసి రామాయణము అయింది. అయనము అంటే మార్గము. అనగా రాముని మార్గము. రాముడు నడిచిన మార్గము. రాముడు అనుసరించిన మార్గము అని అర్థము.
రామాయణములో రాముడు ధర్మాన్ని తాను అనుసరించి, ఆచరించి, ధర్మమార్గంలో తాను నడిచి దారిని మనకు చూపించారు. అదే రామాయణం యొక్క గొప్పతనము.
రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. అవి 6 మరియు 1 కాండములు, 500 సర్గలు గా విభజింపబడ్డాయి. రామాయణ ముని శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులో రాయ బడ్డాయి. అంటే ఒక్క లోకానికి 32 అక్షరాలు ఉంటాయి.
రామాయణము కూడా ఒక కథమాదిరి నడుస్తుంది. కాని అందులో ఉన్న రాముడు, లక్ష్మణుడు భరతుడు, సీత, హనుమంతుడు మొదలగు పాత్రలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు.
రామాయణము హిందూ మతము లో కాదు, బౌద్ధ, జైన మతములలో కూడా ప్రచారంలో ఉంది. మన దేశంలోనే కాకుండా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, లావోస్, బర్మా మరియు మలయా దేశములలో కూడా ప్రచారంలో ఉంది.
రామాయణాన్ని ఎవరి మతానికి తగ్గట్టు వాళ్లు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మలచుకున్నారు. పైన చెప్పినట్టు రామాయణం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది.రామాయణ మహాకావ్యము.దేశవిదేశాల్లో గొప్ప కావ్యంగా కొనియాడబడింది. కాని అన్నింటి లోకల్లా వాల్మీకి రామాయణం ప్రాచీన మయింది అనడంలో ఎలాంటి సందేహము లేదు. అందుకే రామాయణ కర్త వాల్మీకి ఆది కవి అయ్యాడు.
- బాలకాండ
- అయోధ్య కాండ
- అరణ్యకాండ
- కిష్కింద కాండ
- సుందరకాండ
- యుద్ధకాండ మరియు
ఉత్తర కాండ
ఇక చదవండి…….
Great work thanks a lot