Mahabharatam-Aranya parvam2(vol-5)
అరణ్య పర్వం
Aranya parvam
అది శరదృతువు. ఆ శరత్కాలంలో సరస్వతీ మహానదిలో నిత్యమూ క్రుంకులిడుతూ, ఆనదీజలాలు త్రాగుతూ పాండవులు సంతోషంతో మరుదేశంలో కొన్ని నాళ్ళు గడిపారు. వికసించిన కమలాలు, సౌగంధిక పుష్పాలు ఆ పుష్పపరాగ తైలంతో తడిసిన కెరటాల దొంతరలతో, పెక్కు మంది ఋషులచేత ఎల్లప్పుడు ఆరాధించ ఇసుకతిన్నెలతో పాండవులకు ఆ సరస్వతీనది కనులపండువుగా కన్పించింది. అటు పిమ్మట పాండవులు ధౌమ్యుడు మున్నగు బ్రాహ్మణులు, ఇంద్రసేనుడు మున్నగు సేవకులు తమతోపాటు రాగా, కామ్యకవనం చేరి ఋషులచేత అభినందించబడి, అచట యథోచితకర్తవ్యాలు నెరవేరుస్తున్నారు. ఒక్కనాడు,బ్రాహ్మణుల మధ్య కూర్చొని కొలువుదీరి ఉన్న ధర్మరాజు వద్దకు, అర్జునుడిమిత్రుడు ఒకడు వచ్చి అనురాగంతో ఈ విధంగా వచించారు.
‘ధర్మరాజా! ఈ అడవిలో నీవూ, నీ సోదరుల నెమ్మదితో ఉన్నట్లు నిశ్చయంగా తెలిసికొని, మీకు సదా మేలుకోరే మీ మిత్రుడు, గొప్ప తేజస్వి, పాపరహితుడు, దేవకీ సుతుడు అయిన శ్రీ కృష్ణుడు మిమ్మల్ని చూడవలె ననే కోరికతోనే ఇక్కడకు ఇప్పుడే వస్తున్నాడు.
దేవకీ నందనుడు శ్రీకృష్ణుడు, తన దేవేరి అయిన సత్యభామతోపాటు, రథాన్ని ఎక్కి గొప్ప వైభవం ఒప్పారేటట్లుగా ధర్మరాజును సందర్శించటానికై ఏతెంచాడు. శ్రీకృష్ణుడు సత్యభామతోపాటు రథంపై ఉన్నప్పుడు వారిరువురు మెరపు తీగలతో మిరుమిట్లు గొల్పుతూ ఉన్న మేఘాల మధ్య ప్రకాశిస్తున్న దేవేంద్రుడు శచీదేవివలె వెలుగొందారు. ఆ రథం మీద గరుడలాంఛనంతో చెక్కబడిన జె ధగ ధగ లాడుతున్నది. ఆ రథానికి శైబ్యసు గ్రీవాది అశ్వాలు పోల్చబడ్డాయి. అని పొదగబడిన క్రొత్త రత్నాల కాంతులతో వెలుగొందుతూ ఉన్నది. ఆ రథచక్రాల సవ్వడి మేఘగర్జనలవలె ధ్వనించింది. ఆ ధ్వనికి అడవిలో ఉన్న నెమళ్ళు నృత్యం చేశాయి.
వసుదేవుడి కుమారుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా వచ్చి రథాన్ని దిగి, ధర్మరాజుకు నమస్కరించాడు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కౌగిలించుకొని మన్నన తెలిపాడు. ద్రౌపదిని గౌరవించాడు. ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులు శ్రీకృష్ణుడిని గౌరవించారు. ధర్మరాజు శ్రీకృష్ణుడు అర్హ్యాన్ని ఇచ్చి, స్వాగత సత్కారాలు సలిపాడు. అంతట ధర్మరాజు అతని తమ్ములూ బ్రాహ్మణులూ శ్రీకృష్ణుడి చుట్టూ కూర్చున్నారు అప్పుడు శ్రీ కృష్ణుడు అర్జునుడు తనకు దగ్గరగా చేర్చుకొని, చాలాకాలం తరువాత కలిసికొనటంచేత ఏర్పడిన అభిమానం చొప్పున అతడి పై అనురాగం జాలువారే చూపులు పరపి, అభినందించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు.
ఇక చదవండి…..
Aranya parvam Download PDF Book
Read Aranya parvam online here.
maha-bharatham-vol-5-aranya-parvam-p-2Follow us on Social Media