Mahabharatam-Udyoga parvam(vol-7)
ఉద్యోగపర్వం
అభిమన్యుడు అర్జునుడి కొడుకు. అతడికి విరాటుడి కూతురు ఉత్తర పెళ్ళి జరిగింది. పాండవుల తోడి ఈ సంబంధం వలన విరాటుని వంశం పావనం అయ్యింది.
ఆవిధంగా వారందరూ కూడి ఉన్న సమయంలో సభలోని రాజులు అనేకరీతులుగా కృష్ణుడితోనూ ధర్మరాజుతోనూ మాటలాడుతుండగా, శ్రీ కృష్ణుడు పాండవుల కార్యం కోరినవాడయి వారి మాటలను ఆపి, వారినందరినీ కలయ చూచి ఇట్లా అన్నాడు.
‘పాండవులు జూదంలో శకుని కుటిలత్వం చేత తమ రాజ్యం కోలుపోయి, సమర్థులైన ఉండి కూడా సత్యంపై ఉండే అత్యంతాసక్తిరత, కుపితమనస్కులుగాక, ద్యూత నియమానికి భంగం కలగకుండా, అరణ్యాజ్ఞాతవాసాలు చేయనెంచడం సముచితం కాదా.
అరణ్య వాసానంతరం దాటశక్యం కాని అజ్ఞాతవాస సంవత్సరమైన ఈ పదమూడో యేడు గడపటం దుష్కరం. తమను శత్రువు తెలిసికోకుండా ఉండటానికి ఎన్ని ఆపదలు సంభవించినా వీళ్ళు సహించారు.
ధర్మమార్గం విడిచి పెట్టకుండా ఏదయినా ఒక విధం ఆలోచించండి. ధర్మరాజు అధర్మ పద్ధతిన అత్యున్నతమైన ఆ ఇంద్రపదవి లభించినా అంగీకరించడు.
సముచిత మార్గంలో ఎంత ఎంత తక్కువ లభించినా సంతోషిస్తాడు.
కాబట్టి, పాండవులకు తండ్రి సాత్తయిన రాజ్యాన్ని మోసపు జాదంలో దుర్యోధనుడు అవవారించటమూ అది వీరు దిక్కులను జయించి సంపాదించుకొన్నది కావడమూ, ధర్మరాజు మహామభావం ఆలోచించక దుర్యోధనాదులు అవమానించినా సాహసించి ఈ ధర్మరాజు వాళ్ళకు ఎటువంటి కానీ చేయ తలపెట్టి పోటమూ, ఈ రెండు పక్షాల వారికీ పంచుకొని అనుభవించదగింది అవటమూ విచారించి, తగిన కర్తవ్యం ఉపదేశంచటానికి మీరు తగినవారు. నేను కూడా నేనెరిగినంతలో చెప్పుతాను వినండి.
Udyoga parvam Download PDF Book
Read Udyoga parvam online here.
maha-bharatham-vol-7-udyoga-parvamFollow us on Social Media