adiparvam

Mahabharatam-Adiparvam1(vol-1)

ఆదిపర్వం

Adiparvam

కులపతి అయిన శౌనకుడు అనే మహాముని బ్రహ్మర్షులసముదాయంచేత సేవింపబడినవాడై, ఎల్లలోకాల శ్రేయస్సుకొరకు పన్నెండు సంవత్సరాలు జరిగే శ్రేష్ఠ మైన యాగవిశేషాన్ని చేస్తుండగా, ఆ మునులచెంతకు వచ్చి రోమహర్షణు డనేవానికుమారుడున్నూ, మంచిపురాణకథకుడున్నూ అయిన ఉగ్రశ్రవసుడు అనే సూతుడు మిక్కిలి భక్తితో నమస్కరించి ఉండగా, మునులసమూహమంతా కలిసి ఆ కథకుడివలన వివిధపవిత్ర (పుణ్యం కలుగజేసే) కథలను వినవలె ననే కుతూహలంతో అతడిని అధికమైన పూజావిధానాలతో పూజించారు.

పౌరాణికు డైన ఆ ఉగ్రశ్రవసుడు మరల ఆమునుల సముదాయానికి నమస్కరించి, నేను అనేకపురాణాలలోని పుణ్యం కలిగించే కథలను చెప్పటంలో సమర్ధుడు; వ్యాస మహాముని శిష్యుడైన రోమహర్షణుడు అనే పరమపౌరాణికుని, కుమారుడిని; నానుండి మీ రేకథ వినాలని కోరుతున్నారు?’ అని అడుగగా ఆ మునులు ఉగ్రశ్రవసుడు ఈ విధంగా పలికారు.
ఏకథ మనోహరమో, ఏది క్రొత్తదై వింతగా ఉంటుందో, దేనిని వింటే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో ఏది పాపాలను తొలగిస్తుందో అట్టాంటి కథయే వినటం మాకు ప్రీతికరం.
మునులు ఆవిధంగా పలుకగా సౌతి (ఉగ్రశ్రవసుడు)’అట్లయితే మీరు ప్రియమైన పవిత్రకథను చెప్పుతాను: ఏకాగ్ర చిత్తులై వినండి’ అని శౌనకుడు మొదలైన మునులకు ఈ విధంగా చెప్పటానికి ఆరంభించాడు కృష్ణద్వైపాయనుడు అనే పేరు కల వేద తత్వజ్ఞుడు ముని పూర్వం వేదాలన్నీ కలిసి వేరువేరుగా లేకుండటంచేత వాటిని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని నాలుగు వేదాలుగా విభజించాడు.

తన శిష్యు లైన పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనేవారిని ఆజ్ఞాపించి వరుసగా ఆ నలుగురిచేత నాలుగు వేదాలను దారిలో ఉంచుకొనటానికి వీలుగా సంక్షేపసూత్రాలను చేయించాడు. వేదాలను విభజించినవాడు కావటంచేత వేదవ్యాసు డని ప్రఖ్యాతి పొందినవాడై, తన తపోమహిమవలన బ్రహ్మచేత ఆజ్ఞాపింపబడి పదునెనిమిది పురాణాలను నీతిశాస్త్ర ర్మశాస్త్రాలయొక్క అర్జాన్నీ స్వభావాన్నీ, నాలుగు వేదాల యొక్క, వాటికి సంబంధించిన ఉపనిషత్తుల యొక్క భావాలనూ, ధర్మార్థకామ మోక్షాదులతోదా, ఇతరాలైన అరిషడ్వర్గాదులతోనూ సంబంధం గల హృద్యాలైన కథలు ఇతిహాసాలను, కృత త్రేతా ద్వాపర కలియుగంలోని గొప్పమునుల యొక్కయు, రాజుల యొక్కయు వంశాలచరిత్రలను, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రు లనే నాలుగు వర్ణాల యొక్కయు, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాలలోని యొక్కయు చేయవలసిన విదులు విదానాలను,మునులయొక్కయు సమూహాలచేత పూజింపబడిన శ్రీ కృష్ణుని మహత్యమును, పాండవులు మొదలైన భారత శూరుల గుణగణాలును, నిర్మలమైన జ్ఞానంతో నిండిన తనవాక్కనెడి అద్దంలో తేటతెల్లంగా ప్రకాశిస్తూ ఉండగా (భారతాన్ని రచించాడని తరువాతి పద్యంతో అన్వయం).

ఈ మహాభారతం ఎల్లప్పుడునూ తలంచి వింటుండేజనులకు, భక్తితో కూడి ఉండే భక్తులకు భక్తుల యందు ప్రీతి కల లక్ష్మీప్రియు డైన విష్ణువు దయతో సంసారభయాలన్నింటిని తొలగించి కోరినఫలాల లాభాలను కలుగజేసే విధాన- ఆయుర్దాయాన్ని కోరేవారికి దీర్ఘమైన వాయువు యొక్క లాభాన్ని, ధనాన్ని కోరేవారికి అధికమైన ధనలాభాలనూ, ధర్మాన్ని కోరేవారికి సంతతధర్మలాభాన్నీ, వినయాన్ని కోరేవారికి గొప్ప వినయంతో కూడిన బుద్ధి నీ, కుమారులను కోరేవారికి పలువురుకుమారులసంపదయున్నూ, ఐశ్వర్యం కలుగజేస్తుంది కోరేవారికి అభీష్ట సంపదలున్నా ప్రసాదిస్తుంది.

ఇక చదవండి……

Adi Parvam             Download PDF Book

Read Adi Parvam online here.

maha-bharatham-vol-1-adi-parvam-p-1
Follow us on Social Media