aranya kanda

Valmiki Ramayanam-Aranya kanda

అరణ్యకాండ

Aranya kanda

రాముడు సీత, లక్ష్మణుడు వెంటరాగా దండకారణ్యములోనికి ప్రవేశించాడు. ఆ దండకారణ్యములో ఎంతో మంది మహా మునులు ఆశ్రమములు కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉండటం చూచాడు రాముడు. ఆ మునుల ఆశమముల దగ్గర వన్య మృగములు పరస్పర వైరము, భయమూ లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.

పక్షుల కిలకిలారావములతో, వన్యప్రాణుల విహారములతో ఆ వనసీమలో ఉన్న ముని ఆశమములు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి.ఆ మునుల ఆశ్రమం లో విశాలమైన అగ్ని గృహములతోనూ, యజ్ఞమునకు కావలసిన సంభారములు వేలాడుతున్న జింక చర్మం లతోనూ, దర్భలతో, అగ్ని కార్యమునకు కావలసిన సమిధలతోనూ, నీళ్లతో నిండి ఉన్న పాత్రలతో, తినడానికి కావలసిన ఫలములతోనూ నిండి ఉన్నాయి. ఒక పక్కనుండి వేదమంతములు చదువుతున్న ధ్వనులు, మరొక పక్క నుండి పూజా కార్యక్రమముల మంత్ర ధ్వనులు వీనుల విందుగా వినపడుతున్నాయి.

ఆ ఆశ్రమములలో కేవలము తపస్సుచేసుకొనే మునులు మాత్రమే నివసిస్తున్నారు. రామలక్ష్మణులకు ఆ పాంతము బ్రహ్మలోకంవలె రాముడు, సీత, లక్ష్మణుడు తమ ఆశ్రమం వంక రావడం ఆ మునులు చూచారు. వారంతా రామ లక్ష్మణులకు ఎదురు వెళ్లి స్వాగతము పలికారు. వారికి అర్ఘ్యము పాద్యము సమర్పించారు. కొందరు మునులు రామ లక్ష్మణుల దేహధారుడ్యము, అంగసౌష్ఠవము చూచి ఆశ్చర్యపోయారు. వారిని రెప్ప వెయ్యకుండా చూస్తున్నారు.
ఆ మునులందరూ రామ లక్ష్మణులకు, సీతకు ఒక పర్ణశాలను చూపించారు. వారు అందులో నివాసము ఉండవచ్చునని తెలిపారు.కొందరు రామలక్ష్మణులకు నీళ్లు తెచ్చి ఇచ్చారు. మరి కొందరు తినడానికి మధురమైన ఫలములను తీసుకొనివచ్చి ఇచ్చారు.అందులో ముఖ్యులు, పెద్దవారు అయిన మునులు రాముని చూచి ఇలా అన్నారు.రామా! నీవు అయోధ్యకు మహారాజు. రాజు లోక పూజ్యుడు.

రాజు ప్రజలు ధర్మ మార్గంలో నడిపిస్తాడు. రాజు దుష్టులను శిక్షిస్తాడు.ప్రజలను రక్షిస్తాడు. అందుకే రాజును అందరూ గౌరవించాలి,పూజించాలి. ప్రజారక్షకుడైన రాజు ఇందులో నాలుగవ అంశ అని అంటారు. అందు చేతనే రాజు ప్రజల మన్ననలు పొందుతూ రాజభోగములు ఇంద్రుని వలె అనుభవిస్తుంటాడు. ఈ ప్రదేశం అయోధ్య రాజ్యం లో ఉంది. కాబట్టి నీవే మాకు రాజువు. నీవే మమ్ములను రక్షించాలి. నీవు ప్రస్తుతము వనములో ఉన్నావని రాజువు కాకపోవు. రాజు అయోధ్యలో ఉన్నా, అడవిలో ఉన్నా, రాజు రాజే.

ఇక చదవండి……

Aranya kanda

Download PDF Book

Read Aranya kanda online here.

Valmiki-Ramayanamu-aranyakanda

Follow us on Social Media