Valmiki Ramayanam-Balakanda
బాలకాండ
Balakanda
అయోధ్యా నగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనము చేసాడు. పండితులను పూజించాడు. అమితమైన పరాక్రమ వంతుడు. దశరథుడు అంటే అయోధ్య ప్రజలు ఎంతో ఇష్టం ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించే వాడు. దశరథుడు ఎన్నో యజ్ఞము లను యాగములను చేసాడు. రాజర్షి. దశరథుని మంచితనము మూడులోకములలో చెప్పుకొనెడి వారు. దశరథుడు తన శతువులకు భయంకరుడు. తన శత్రువులను కూడా మిత్రులు చేసుకొనే నేర్పు కలవాడు. అధిక మైన సంపదలు కలవాడు.
అన్నింటికంటే గొప్ప విషయం దశరథుడు తన ఇందియ జయించిన వాడు, జితేంద్రియుడు అని పేరు గాంచాడు. ఎల్లప్పుడూ సత్యమునే పలికెడు వాడు. అసత్యము అన్నది ఎరుగడు.
పూర్వము మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారం పరిపాలన సాగించాడు దశరథుడు.
అయోధ్యా నగరములో చెవులకు కుండలములు లేనివాడు,కిరీటములు లేనివాడు, పుష్పమాలలతో అలంకరించుకొనని వాడు, ప్రతిరోజూ అభ్యంగనస్నానముచేయని వాడూ చూద్దామన్నా
కానరారు. అలాగే కడుపునిండా భోజనము చేయని వాడు కానీ అతిధికి పెట్టకుండా తాను తినేవాడుకానీ, దానధర్మములు చేయనివాడు కానీ, ఇంద్రియ నిగ్రహము లేనివాడు కానీ అయోధ్యలో లేడు.
అయోధ్యలో దొంగలు లేరు, దొంగతనములు లేవు. ఏ వర్ణము వాడు వాడికి విధించిన పని మాత్రమే చేసేవాడు. యజ్ఞములు యాగములు చేసేవారు.
బ్రాహ్మణులు నిత్యమూ అగ్నిహోత్రము చేసేవారు. వేదాధ్యయనము చేసేవారు. అతిధి పూజ, దానధర్మములు సేవారు. స్వంత భార్యతోనే సంగమించేవారు. పరాయి స్త్రీలను కన్నెత్తి చూచేవారు కాదు. అత్యవసర పరిస్థితులలో తప్ప ఇతరుల నుండి దానములు స్వీకరించేవారు కాదు దశరధునిపాలనలో నాస్తికులు గానీ, అసత్యము పలుకువారు కానీ, అసూయ ద్వేషములు కలవారు కానీ, అశక్తులు కానీ విద్యనేర్చుకొనని వారు కానీ లేరు.
ఇక చదవండి….
Valmiki Ramayanam – Balakanda
Download PDF BookRead Valmiki Ramayanam – Balakanda online here.
Valmiki-Ramayanamu_Balakanda
Follow us on Social Media