Mahabharatam-Santhi parvam1(vol-12)

శాంతి పర్వం

ఓ హరిహరనాథా! జనమేజయ మహారాజుకు వైశంపాయన మహర్షి ఈ విధంగా చెప్పాడు – పాండవులు తమ చనిపోయిన బంధుమిత్రుల కందరికీ జలతర్పణాలను ఇచ్చారు. మృతాశౌచాన్ని పోగొట్టుకొనటానికి గంగానది తీరంలో ఒక సమతల ప్రదేశంలో గుడ్డల గుడారాల నెత్తించారు. ధృతరాష్ట్ర విదురాదులనూ, భరతవంశీయుల భార్యలనూ ఆ గుడారాలలో ఒక నెలరోజులు ఉంచారు.

ఆ సందర్భంలో ధర్మరాజును దర్శించటానికి వ్యాసుడు, నారదుడు, దేవుడు, దేవస్థాణుడు, కణ్వుడు మొదలైన మునీంద్రు లెందరో శిష్యులతో సహా విచ్చేశారు. ధర్మరాజు వారందరికీ ఎదురుపోయి, నమస్కరించి, అర్ఘ్యపాద్యాది పూజావిధులతో సత్కరించి వారిని సంతోషపెట్టు. శ్రీకృష్ణుడు, సోదరులూ ఎల్లప్పుడూ తనతో కలిసి ఉంటూ ఉండగా ఆ మహర్షులను ధర్మజుడు సేవించాడు ఆ రాజును వారందరు ప్రియవచనాలతో పలకరించారు. ఆ తరువాత ఆ మహాత్ములందరి పక్షాన ధర్మరాజును కుశల ప్రశ్నలతో కూడిన మాటలతో సమ్మానించటానికి నారదుడు ముందుకు వచ్చాడు. ఆ మహర్షి పెద్దల నందరిని కలయజాచి ధర్మరాజు ముఖం వైపు చూచి ఇట్లా అన్నాడు.

‘ధర్మజా! నీ అదృష్ట మేమని చెప్పాలి! అటు శ్రీకృష్ణుడు సదా తన మనస్సులో నీకు మేలు కలగాలని కోరుతూ ఉండగా, ఇటు గర్వోత్సాహాలతో ఉప్పొంగే బాహుబలం తో ప్రకాశించే పార్ట్ గాండీవ పరాక్రమంతో యుద్ధ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉండగా, ప్రజలందరూ నిన్ను గౌరవిస్తూ ఉండగా నీవు ఈ రాజ్యాన్ని ఈ విధంగా సగౌరవంగా సార్థకంగా పొందావు.

కురువంశంలో ప్రసిద్ధుడు! ధర్మరాజా ! లోకాల నన్నింటినీ భయపెట్ట గలిగే భయంకర యుద్ధాలు సంభవించినప్పుడు నీ తమ్ములతో బయటపడడం మంచిది. యుద్ధంలో పంతాలు పెరిగి బలాలను మాత్సర్యాలను ప్రదర్శించే పట్టులలో సైతం ధర్మమార్గం నుండి ఏమాత్రం తప్పకుండా ఉండే నీ నియతి నీలోని ఎంతో మంచిగుణం. ధర్మరాజా! మరి – దీనివల్ల నీ దుఃఖాన్ని తగ్గించుకొన్నావా; ఇప్పుడు నీ మనస్సు సంతోషాన్ని పొందిందా??

ఇక చదవండి…..

Shanthi Parvamu part 1  Download PDF Book

Read Mahabharatam-Shanthi parvam(part-1)  online here

maha-bharatham-vol-12-santi-parvam-p-1
Follow us on Social Media

2 comments

  • Any one has Telugu Mahabharatam old PDF’s where there was no sloka and tatparyam. It has only the story running. Ols PDF’s were great to read as they were simple, easily understandable and illustrious. Please share them if you have.

    • Hi Krishna,
      The mahabharatam only telugu story with out slokas added. Please check Mahabharatam section.
      Thanks