santhi parvam

Mahabharatam-Shanthi parvam2(vol-13)

శాంతి పర్వం

ఓ హరిహరనాథా! పూర్వకథ అనంతరం మళ్ళీ ఆ వైశంపాయన ఋషి తన ఎదుటగల జనమేజయ మహారాజుతో ఇట్లా అన్నాడు. ఆ విధంగా అనేక విధాలయిన రాజధర్మాలను భీష్మ పితామహుడు వివరించి చెప్పు, ధర్మరాజు, అతని తమ్ములూ విని సంతోషించారు. తరువాత మళ్ళీ ఆ తాతగారు మనుమడిలో నాకు తెలిసినంతవరకు ప్రజ్ఞను పెంచే మాటలు అనేకం నీకు వినిపించాను. ఇంకా ఏమి వినటానికి ఉత్పహిస్తున్నావు?’ అని అన్నాడు. దానికి బదులుగా ఆ ధర్మరాజు అణకువతో నమస్కరించి తిరిగి తన కోరికను ఇట్లా పేర్కొంటున్నాడు.

ఉజ్జల పై వ్యాపించే తేజస్సుతో వెలుగుతున్న ఓ పితామహా! ఇంతవరకు రాజునైన నాకు రాజోచితధర్మాలు స్పష్టంగా క్రమంగా వినిపించావు. ఇపుడు నేను ఈ సకల భూజనులకూ గొప్ప మేలు కలిగించగల ధర్మమేదో, దానిని తెలిసికొనాలి అనుకొంటున్నాను. దయతో దానిని తెలియజేయుము.

‘రాజా! వినుము. ధర్మం అనేక విధాలుగా విస్తరిల్లి ఉన్నది. దానిలో ఎంతగా వైవిధ్యమున్నా, మరెంతగా విస్తృతి ఉన్నా, మొత్తంమీద సర్వమూ ఆచరణయోగ్యమే. దానిలో ఒక్కటి కూడా ఫలితం సాధించలేనిది లేదు కాని, ధర్మతత్త్యం తెలిసినవారు మాత్రం తమకు ముక్తిని ప్రసాదించగలదు శ్రేష్ఠ ధర్మమని పలుకుతారు.

ధర్మాలు సమయ సందర్భాలను బట్టి దేశ కాలాలను బట్టి అనేక విధాలుగా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాటిలో భేదాలు, మరికొన్ని సందర్భాలలో సాదృశ్యాలు కనిపించవచ్చును. ఏది ఎలా ఉన్నా ధర్మమన్న ప్రతిదీ ఆచరణకు ఉద్దిష్టమైనదే. ఆచరిస్తే తప్పక ఫలితాన్ని అందించేదే. నిష్ప్రయోజనం ధర్మం ఉండదు. అయితే ఆ ప్రయోజనాలలో హెచ్చు తగ్గులు ఉండవచ్చును. ఆ దృష్టితో చూచినప్పుడు అన్ని ప్రయోజనాలకు చివరిదైన మోక్షమనే దాన్ని ఒసగగల ధర్మమే శ్రేష్టం.

ఇక చదవండి…..

Santhi Parvam Download PDF Book 

Read Mahabharatham Santhi Parvam (part-2) online here.
maha-bharatham-vol-13-santi-parvam-p-2
Follow us on Social Media

One comment