
Potana bhagavatam (vol-2)
పోతన భాగవతం
Potana bhagavatam (vol-2)
తండ్రి తన భర్తను యజ్ఞానికి ఆహ్వానించకుండా అవమానించాడనీ, శివునికి భాగం కల్పించకుండా * యజ్ఞం జరిపిస్తున్నాడనీ సతీదేవి గ్రహించింది. తన కోపాగ్ని జ్వాలలతో లోకాలను బూడిద చేయాలన్నంత ఉద్రేకం వచ్చింది. అప్పుడు ప్రమథ గణాలు శివుని ద్వేషించి యజ్ఞం చేస్తున్నాననే దురహంకారంతో మిడిసి పడుతున్న దక్షుణ్ణి హత మారుస్తాం అని ముందుకు దూకారు. సతీదేవి వారిని వారించింది. రోషా వేశంతో తండ్రివైపు చూచి యిలా అన్నది. పరమేశ్వరుడు లోకంలోని ప్రాణులందరికీ ఎంతో యిష్టమైవాడు.
ఆ మహాదేవునికి ఇష్టమైనవారు గానీ, ఇష్టం లేనివారు గానీ ఎవరూ లేరు. ఈ విశ్వంలో ఆయనకంటే అధికులు లేరు. సకల విశ్వానికి కారణము ఈశ్వరుడే. ఆయనకు ఎవరియందూ ద్వేషం లేదు. అలాంటి దేవదేవుని నీవు తప్ప లోకంలో ఇంకెవ్వడూ ద్వేషించడు. అవమానించటానికి పూనుకోడు. అంతేకాదు. కొందరు నీవంటివారు ఇతరుల గుణాలలో దోషాలను ఆరోపిస్తారు. కొందరు మధ్యస్థు లుంటారు. వారు పరుల
గుణాలనే గ్రహిస్తారు. దోషాలను గ్రహించరు. సత్పురుషులు కొంద రుంటారు. వారు దోషాలను గూడ గుణాలుగా గ్రహిస్తారు. ఇక ఉత్తమోత్తము లైనవారు కొంద రుంటారు. వారు పరులయందు దోషాలను ఆపాదింపు. వారి నీచ గుణాలను సైతం సద్గుణాలుగా పెద్ద చేసి గౌరవిస్తారు. అటువంటి మహాత్ముల పై నీవు ద్వేష బుద్ధితో దోషాలను ఆరోపిస్తున్నావు. జడపదార్థమైన దేహమునే ఆత్మ అని వాదించు దుర్జనులు సజ్జనులై వారిని నిందించుటలో వింతలేదు. మహాత్ముల పాదధూళి ముందు వెలవెలబోయిన తేజముగల
వారు అంతకంటే చేసేది ఏముంటుంది.
శివ’ అను రెండు అక్షరాలను ఆసక్తితో నోటితో పలికిన మనస్సులో తలచినా సమస్త ప్రాణుల సర్వ పాపాలు నశిస్తాయి. అలాంటి మంగళ స్వరూపుడూ, మహానుభావుడూ అయిన శివుణ్ణి, అమంగళ మనస్కుడవయిన నీవు ద్వేషించుట విచిత్రంగా ఉన్నది. గొప్ప విజ్ఞానులు అయినవారు ఆ పరమ శివుని పాదారవిందాలను ధ్యానిస్తూ బ్రహ్మానందమనే మకరందాన్ని తమ మనస్సులనే తుమ్మెదల ద్వారా భక్తి పారవశ్యంతో త్రాగి ధన్యులౌతారు. అలాంటి దేవదేవునికి నీవు ద్రోహం చేశావు. నిన్ను ఏమనాలి.
ఇక చదవండి…..