pothana bhagavatam

Potana bhagavatam (vol-5)

పోతన భాగవతం

Potana bhagavatam

కృష్ణుడు మనకంటే పెద్దవాళ్లు కావటం వల్ల ధర్మరాజు భీముడికి పాదనమస్కారం కావించాడు. తనతో సమాన వయస్కుడు కావటంవల్ల అర్జునుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. తనకన్న చిన్నవాళ్లు కనుక ప్రణమిల్లిన నకులుడు సహదేవుని ఆదరంతో లేవనెత్తాడు. అనంతరం క్రొత్త పెండ్లి కూతురు ద్రౌపది కొంచెం సిగ్గు పడుతూ కృష్ణుడికి మొక్కండి. ఆ పైన కృష్ణుడు కుంతీదేవి వద్దకు వెళ్లి నమస్కరించి ఇలా అన్నాడు.

అత్తా! కొడుకులు కోడలు
చిత్తానందముగ పనులు సేయఁగ నాత్మా
యత్తానుగవై యాజ్ఞా
సత్తాదులు గలిగి మనదే సమ్మోదము నన్


అత్త య్యా! నీ కొడుకులూ, కోడలూ, నీకు నచ్చిన విధంగా, నీవు మెచ్చిన విధంగా పనులు చేస్తున్నారా చేయవలసిన పనులుచెబుతూ సంతోషంగా ఉంటున్నావు కదా! “అన్న మేనల్లుడి మాటలకు మేనత్త ప్రేమ విహ్వలత నందుచు గద్గద భాషణంబులం గనుఁగవ నశ్రుతోయములు గ్రమ్మగ” సముచితంగా సంభాషించింది

లోకకంటకుడైన నరకాసురుడి పైకి యుద్ధానికి సిద్ధమై వెళుతున్న శ్రీకృష్ణుణ్ణి చేతులు మోడ్చి ఇలా వేడుకుంటుంది సత్యభామ

దేవా! వీపు విశాటసంఘముల ముద్దీపించి చెండాడ నీ
ప్రావీణ్యం బులు చూడ గోరును గదా ప్రాణేశ! మన్నించి వ
వెంట గొన్పిస్థామ్ము, నేఁడు కరుణన్, నేఁజాచి యేతెంచి నీ
దేవీపంహం కెల్లఁ జెప్పుదు భవద్గీప్తప్రతాదోన్నతుల్

భార్య సమరరంగానికి వస్తానంటే ఏ భర్తా నమ్మతింపడు. అందు వల్ల సంభాషణా చతుర అయిన సత్యభామ “స్వామీ! సంగ్రామసీమలో మీ వీరవిజృంభణాన్ని వీక్షించాలని కుతూహలంగా ఉన్నది. అంతేకాదు తిరిగి వచ్చిన తరువాత మీ ప్రతాపం ప్రాభవాన్ని నా సంపత్ లందరికీ వివరించి చెబుతాను” అని కాదనటానికి వీలులేని విధంగా అడిగింది. అయితే అందుకు అంత అనాయాసంగా అంగీకరిస్తాడా ఆ సత్యభామాధవుడు అయన ఆమెను వద్దని వారించాడు.


ఆమె నరుకుణ్ణి చూస్తున్నది. నాథుడిని చూస్తున్నది. అయితే ఆ చూపుల్లో తేడా ఉన్నది. పరుణ్ణి చూచే చూపు సంతాపింప జేస్తున్నది. పరుడి పైన రోషం, విరత భూకుటి, వీరం, కెంపు చండాస్త్ర సందోహం ప్రదర్శిస్తున్నది వరుడు పైన రాగోదయం, మందహాసం, శృంగారం, సొంపు, సరసాలోక సమూహం ప్రసరిస్తున్నది. పూర్తిగా పరస్పర విరుద్ధమైన అంశాలను మేళవించి రసికరసాయనంగా అందించారు పోతన్నగారు. ఈ పద్యం “అని జూచున్ హరిఁజూచు” అన్న నాచన సోమన్న గారి పద్యం కన్న ఎంతగానో అందగించింది

జ్యావల్లీద్వవి గర్జనంబుగ, సురల్ సారంగ యూధంబుగా
వా విల్లింద్రశరాసనంబుగ, పరోజాక్టుండు మేఘంబుగా, రా విద్యుల్లత భంగి వింతి సురజిద్దావాగ్ని మగ్నంబుగా ప్రావృట్కాలము సె బాణచయ మంభశ్మీకర శ్రేణిగాన్.

నారి ధ్వని అను ఉరుముతోనూ, దేవతలు అనే చాతక సమూహంతోనూ, విల్లు అనే ఇంద్రధనుస్సు లో, కృష్ణుడు అనే నీలిమబ్బుతోనూ, సత్యభామ అనే మెఱపు తీగతో, రాక్షసులు అనే దావాగ్ని తోనూ, శర పరంపర అనే వర్షధారతోనూ ఆ సమరసమయం వర్షాసమయంగా మారి పోయింది

సత్య వదనం హరికి రాకేందు బింబంగానూ, అరికి రవిబింబం గానూ కనపడింది. సత్య చేలాంచలం హరికి కందర్ప కేతువు గానూ, ఉరికి ఘన ధూమకేతువుగానూ దర్శన మిచ్చింది. సత్యధనుస్సు హరికి భావ పరిధిగానూ, ఆరికి ప్రళయార్కు పరిధిగానూ ప్రత్యక్షమైంది. సత్య సందర్శనం హరికి అమృత ప్రవాహంగానూ, అరికి అనల సందోహంగానూ అనిపించింది. సత్య బాణవృష్టి హరికి హర్షదాయిగానూ అరికి మహారోషదాయిగానూ స్క్షాత్కరించింది.. 

ఇక చదవండి…..

Potana Bhagavatam vol-5 Download PDF Book  

Read Potana Bhagavatam vol-5 online here.

 

potana-bhagavatam-vol-5

Follow us on Social Media