Potana bhagavatam – (vol-4)
పోతన భాగవతం
దశమ స్కంధం
Potana bhagavatam Dasama Skandam
శ్రీ కైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్.
ఈ పద్య ప్రసూనంలోని ఆరుదళాలూ ఆయా స్కంధాల్లోని ఆయా కథలను సూచిస్తున్నాయని ఇంతకు ముందే ప్రథమస్కంధంలో ప్రస్తావించి ఉన్నాను. పై పద్యంలోని ఆరవదళమైన “మహానందాంగనా డింభకున్” అన్నది దశమస్కంధాన్నీ, అందలి శ్రీకృష్ణ లీలా విశేషాలను అభివ్యక్తం చేస్తున్నది. ఆనంద స్వరూపిణి అయిన ఆ నంద గోపుని ఇల్లాలు యశోదమ్మ ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న నల్లనయ్యను ధ్యానిస్తున్నా నన్నాడు పోతన్నగారు. ఆ యశోదా కిశోరుడు సామాన్యుడు కాడు. ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా ఎల్ల లోకాలనూ చల్లగా పరిపాలిస్తుంటాడు. ప్రపన్నులైన భక్తుల ప్రార్థనలను ఆలించి లాలిస్తూ ఉంటాడు. నిరంకుశులైన నిశాచరుల ఔద్ధత్యాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు. అంతేకాదు. కన్నతల్లి ఒడిలో ఒయ్యారంగా కూర్చున్న ఆ చిన్నికన్నయ్య ఒక్కమాటు అలా కన్నెత్తి చూస్తే చాలు – ఎన్నెన్నో బ్రహ్మాండ భాండాలు ఆ చూపులో రూపులు దిద్దుకుంటాయి
శ్రీకృష్ణ సౌందర్యాన్ని సహృదయ హృదయంగమంగా సంస్కృతంలో మహా కవులు వర్ణించారు. శుభాకృతులైన ఆ కృతులలో జయదేవుని “గీత గోవిందం”. లీలాశుకుడు “శ్రీకృష్ణ కర్ణామృతం”, నారాయణ తీర్థులవారి “శ్రీకృష్ణ లీలాతరంగిణి” ప్రధానంగా చెప్పుకోదగ్గవి. ఇక తెలుగులో శ్రీ కృష్ణుని లీలావిలాసాలను ఎఱ్ఱన మహాకవి తన హరివంశంలో సుమనో మజ్జంగా చిత్రించాడు. తరువాత బమ్మెర పోతన్నగారి భాగవత దశమస్కంధం కృష్ణావతార వైభవాన్ని అత్యంత హృదయంగమంగా, అద్వితీయంగా, అనన్య సామాన్యంగా అభివర్ణించింది. ఒక విధంగా చెప్పాలంటే దశమ స్కంధం “మహానందాంగనా డింభకుని లీలా సర్వస్వమని భావించవచ్చు. దేవకీ గర్భస్థుడైన భగవంతుని బ్రహ్మాది దేవతలు ప్రార్థిస్తాడు.
ఏమి నోము ఫలమొ ఇంత ప్రాద్దోక వార్త, వింటి మబలలార! వీను లలర మన యశోద చిన్ని మగవానిఁ గనె వంట; చూచి వత్తమమ్మ! సుదతులారా
అనుకుంటూ యశోద ఇంటికి వస్తున్న ప్రజకాంతల ఉత్కంఠను పోతన్నగారు ఈ విధంగా వివరించారు.
వేడుకతోడఁ గ్రొమ్ముడులు వీడఁ గుచోపరిహారరేఖ ల
ల్లాడఁ గపోల పాలికల హాటక పత్రరుచుల్ వినోదనం
బాడఁ, బటాంచలంబు లసియాడఁగఁ జేరి యశోదయింటికిం
జేడి లేఁగి చూచి రాగి, జిష్ణుని విష్ణునిఁ జిన్ని కృష్ణునిన్.
అలా వచ్చిన గోపాంగనలు తెచ్చిన కానుక లిచ్చి, చిన్ని పాపనికి తల అంటి, పసుపు పూసి, స్నానం చేయించారట. నీళ్లు చుట్టు తిప్పి, రక్ష పెట్టి, తొట్టెలో ఉంచి జోలపాడారట
జోజో కమలదళేక్షణ, జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా
జోజో పల్లవ కరపద, జోజో పూర్ణేందువదన! జోజో యనుచున్
గొల్ల యిల్లాండ్రు అలా జోల పాడుతూ ఊపుతూ ఉంటే దొంగ నిద్దుర పోతున్న బాలకృష్ణుణ్ణి,పోతన్నగారు ఈ విధంగా వివరించారు.
లోకములు విదుర వోవఁగ, జోకొట్టుచు నిదురవోని సుభగుఁడు, రమణుల్ జోకొట్టి పాడ విదురం, గైకొను క్రియ నూరకుండె, కనుదెజవకయున్
చిన్నారి నల్లనయ్యకు అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి. “అవ్వా అవ్వా” అంటున్నాడు. అక్కడ పోతన్నగారి కల్పనా శిల్పం ఈ క్రింది కందం అందంగా రూపొందింది. చిత్తగించండి .
ఇక చదవండి…..
Potana bhagavatam Dasama Skandam Download PDF Book
Read Potana bhagavatam Dasama Skandam online here
potana-bhagavatam-vol-4Follow us on Social Media