potana bhagavatam

Potana bhagavatam (vol-1)

ఇక తాళ్ళపాక అన్నమాచార్యులు, వారి వంశీయులు, రామదాసుగా ప్రసిద్ధికెక్కిన గోపన్న- త్యాగరాజు ప్రభృతులు పోతన్న ప్రభావం ప్రసరించడం సహజం. త్యాగరాజు నిత్యార్చనలో పోతన భాగవతపారాయణం సలిపేవాడు. తెలుగుదేశంలో పోతన భాగవతంలోని పద్యాలు తరతరాలుగా వేలకొలది నాలుకలపై నిత్య ప్రార్థనా శ్లోకాలు నిలిచిపోయాయి. ఆంధ్రదేశంలోనే కాక యావత్ భారతదేశంలో ఉద్యమస్థాయిలో వెల్లివిరిసిన భక్తి వేదాంత తత్వ ప్రచారానికి పోతన మహాకవియే భవ్యకవితావేశం అందించిన మూలపురుషుడు. భక్తినే ముక్తికి రాచబాటగా యోగీశ్వరు లెందరో ఉపదేశించిచారు.

వారి చరిత్రలు జీవదుదాహరణము లైనాయి. భక్తి ప్రచారం సనాతన భారతీయ సంస్కృతి ప్రతికూల సభ్యతా ఝండా మారుతాలనుండి సంరక్షించిన వజ్రకవచ విది. సనాతనమతంలో కర్మ జ్ఞాన వైరాగ్య మార్గాలు సామాన్య ప్రజా సముదాయానికి సులువైనవి కావు. భక్తియోగం సరళసుందరమై సద్యోముక్తి దాయకంగా సమస్త ప్రజావళికి ఆరాధ్యమైంది. కర్మజ్ఞాన వైరాగ్య మార్గాలు ఆస్తికులైన అనుష్ఠాన వేదాంతులు చిరసాధనతో చేయవలసిన సుదీర్ఘ శరణాగతి. భక్తి శీఘ్రశరణాగతి; సద్యోముక్తి ప్రదాయకం.
పోతన తెలుగు భాగవతం లోని ప్రతి పద్యం సద్యో ముక్తి సంధాయకం. అందుచే భాగవతం ఆంధ్రుల అభిమానకావ్యంగా తరతరాల తెలుగు హృదయాలను ఉవ్విళు లూరిస్తున్నది

పోతన మహాకవి మూర్తీభవించిన భక్తివేదాంత తత్త్వం ఆంధ్రంలోనికి భాగవతం అవతరింపజేశాడు భాగవతం త్లైలిగించడం “వునర్జన్మంబు లేకుండుటకై” పోతనజేసిన సాహితీతపస్సు. “హరి కిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరా బొకడు భాగవతంబు జగద్ధితంబుగన్” అని తనకృతిని నరాంకితం సల్పకుండా శథం చేసిన మహామహితాత్ముడాయన!

భగవద్భక్తికి గుండెల్లో వెన్నెల కోవెల నిర్మించుకొని భాగవతకృతి వ్రాసిన పోతన తన కావ్యపీఠికలో వ్యాస, వాల్మీకి కాళిదాసాది ప్రాచీన కవుల్ని ప్రశంసించి, ఆంధ్రకవితా గౌరవ జనమనోహారి నన్నయసూరిం గైవారంబు సేసి, హరిహర చరణావిందవంద నాభిలాషిం దిక్కన మనీషిం భూషించి మజియు నితరపూర్వకవి జనసంభావనంబు గావించి వర్తమానకవులకుం బ్రియంబు పలికి, “భావికవుల” బహూకరించిన సహృదయసార్వభౌముడు. భాగవతం కోసమే తెలుగు పుడమిలో పుట్టిన కారణజన్ముడు గాని తన్ను గూర్చి పోతన సంభావించుకొన్నవాడు. పోతన భక్తి సంకుచితమైంది కాదు

చేతులారంగ శివపూజ చేయవలెననీ, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువ వలెననీ అతని అభిమతం.

 Please wait a moment to load the book.

Potana bhagavatam Download PDF Book

Read Potana bhagavatam vol-1 online here.

  

potana-bhagavatam-vol-1
Follow us on Social Media

One comment