Sai Leelamrutham
Sai Leealamrutham
సాయి లీలామృతం
మన యింద్రియాలకు, మనస్సుకు ఎన్నడూ గోచరించని, భగవంతుడు, పరలోకము, పునర్జన్మ లాంటివి వున్నాయని మానవజాతికి ఎలా తెలిసింది? ప్రపంచ సంస్కృతి అంతా మానవజీవితమంతటినీ వీటిపై విశ్వాసంతో సమన్వయం చేసి మానవజాతి రూపొందించుకొన్నదే. ఇట్టి ఆధ్యాత్మిక విద్యకంతటికీ మహాత్ములే మూలం. వేదాలు ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మము మొ||న శాస్త్రాలు, వివిధ యోగ సాంప్రదాయాలు, బౌద్ధ, జైన, పార్శీ మరియు క్రైస్తవ మతాలూ దివ్యానుభవం పొందిన మహాత్ముల వల్లనే మానవజాతికి లభించాయి.
వేదఋషులనుండి శ్రీ సాయిబాబా వంటి నేటి మహాత్ముల వరకూ అందరూ, అటువంటి మహనీయుల నుండి మాత్రమే ఆత్మజ్ఞానము లేక ముక్తి పొందడం సాధ్యమని చెప్పారు. శ్రీరాముడు విశ్వామిత్రుణ్ణి, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని సేవించి జాతికి ఆదర్శం చూపారు. బుద్ధుణ్ణి, ఆయన చెప్పిన ధర్మాన్నీ శరణుపొందాలని బౌద్ద మతము, క్రీస్తును శరణు పొందాలని క్రైస్తవమూ చెబుతాయి. మహమ్మద్ ప్రవక్త నడచిచూపిన మార్గాన్నే ఆశ్రయించాలని, ఆయన ద్వారా ప్రకటమైన ఖురాన్ ను విశ్వసించాలనీ ఇస్లాం చెబుతుంది. ఆ మతంలో ఉద్భవించిన సూఫీ సాంప్రదాయంలో సద్గురువు (పీర్-ఓ-మూర్షద్)ను ఆశ్రయించడమే ముఖ్యసూత్రం. కబీరు, వేమన, గురునానక్ ల నుండి శ్రీ సాయిబాబా వరకూ మహాత్ములందరూ అలానే చెప్పారు. నామదేవుడు, రామకృష్ణ పరమహంస వంటివారు యిష్టదేవతలను ఆరాధించి సాక్షాత్కారం పొందినా, ఆ దేవతలు మోక్షం కోసం బ్రహ్మజ్ఞానియైన గురువును ఆశ్రయించమనే చెప్పారు.
కానీ సద్గురువును గుర్తించి ఆశ్రయించడం ఎంతో కష్టం. ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడు, “ఎన్నో వలనందిలో ఆత్మఖ్ఞానం కోసం ప్రయత్నించేవాడు – ముముళ్లువు – ఏ ఒక్కడో వుంటాడు” అని చెప్పారు. ఇక అత్మక్థానియైన సద్గురువు ఆ యుగంలోనే అంత అరుదైతే ఈ కలికాలంలో ఊరికి ఒక్కరు, వీధికొక్కరు వద్దుతువులుగా వెలవచం ఎంత విడ్డూరం! ఇందరు నకిలీ గురువుల మధ్య సిసలైన సద్గురువును గుర్తు పట్టేదెలా కనుక భువంతుడే భూమిమీద విశ్వ గురుడైన దల్తాత్రేయునిగా మానవోద్దరణ కోసం పరిసమాప్తిలేని నిత్యావతారంగా విలిచాడు. అందుకే ఆయన వివిధయోగ సంప్రదాయాలన్నింటికీ మూలపురుషుడయ్యాడు. ఆయన యిటీవల కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు. శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కల్కోట మహరాజ్, శ్రీ శిరిడీ సాయిబాబాలుగా అవతరించారు. అంటే వీరందరి చరిత్రలూ కలిపి ఒకే దత్తాత్రేయుని దివ్యచరిత్రన్నమాట.
Other Parayana Books in Telugu
సాయి మాస్టర్ గారిచే రచించబడిన సాయి లీలామృతం ఇక చదవండి..
Sai Leelamrutham Parayana Vidhi
Thursday Parayana గురువారం పారాయణ
Friday Parayana శుక్రవారం పారాయణ
Saturday Parayana శనివారం పారాయణ
Sunday Parayana ఆదివారం పారాయణ
Monday Parayana సోమవారం పారాయణ
Tuesday Parayana మంగళవారం పారాయణ
Wednesday Parayana బుధవారం పారాయణ
Sai Leelamrutham
Download PDF BookRead Sai Leelamrutham in Telugu online here
Loading of the full book taking some time please stay with us, please refresh a couple of times.
sampurna-saileelamruthamFollow us on Social Media