potana bhagavatam vol-3

Potana bhagavatam – (vol-3)

పోతన భాగవతం

Potana bhagavatam

కమలాక్షు నర్చించు కరములు “కరములు” శ్రీనాథు వర్ణించు జిహ్వ “జిహ్వ” సుర రక్షకునిఁ జూచు చూడ్కులు “చూడ్కులు” శేషశాయికి మ్రొక్కు శిరము “శిరము

విష్ణు నాకర్ణించు వీనులు “వీనులు” మధువైరిఁ దవిలిన మనము “మనము” భగవంతు వలగొను పదములు “పదములు” పురుషోత్తముని మీఁది బుద్ధి “బుద్ధి

దేవ దేవునిఁ జింతించు దినము “దినము”, చక్రహస్తునిఁ బ్రకటించు చదువు “చదువు కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు “గురుఁడు”, తండ్రి! హరిఁ జేరుమనియెడి తండ్రి “తండ్రి.”

కమలాక్షుని అర్చించే కరములే అసలైన సిసలైన కరములు; శ్రీనాథుని వర్ణించే జిహ్వయే సరియైన జిహ్వ అంటూ అన్నీ చెప్పి చెప్పి అంతటితో ఆగకుండా అచ్యుతుని సేవకు అంకితంగాని అవయవాలు ఎంత అధమాధమములో ఎంతనీరసములో నిరూపించసాగాడు.
మనోవాక్కాయ కర్మలతో త్రికరణశుద్ధిగా శ్రీహరి నవవిధభక్తులు సేవించాలి మొదటి పద్యం మాత్రమే మూలానికి అనువాదం. తర్వాత పలికిన “అంధేందూదయముల్” అన్నవృత్తమూ, “కమలాక్షు నర్చించు”, “కంజాక్షునకు గాని”, “సంసారజీమూత” ఇత్యాది మూడు సీసపద్యాలూ మూలకాలు. అవి సహజ పాండిత్యులవారి స్వకీయాలు ఈ విధంగా భక్తి రసాన్ని సీసాలనిండా నింపి బమ్మెరపోతన గారి పఠితలకు అందించారు. అసలు ఈ పద్యాలు పోతన్నగారి జీవిత పరమార్థాన్ని ప్రకటిస్తున్నా యేమో! తను నమ్మిన భక్తి సిద్ధాంతాన్నే, తన

మనస్సులోని భావాన్నే బమ్మెరవారు ప్రహ్లాదుని నోటివెంట పలికించారేమో అని నా అనుమానం ఇక “మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు” ఇత్యాది పద్యాన్ని గురించి ప్రత్యేకంగ చెప్ప నక్కరలేదు. అది ప్రహ్లాదుని మానసిక భావాలకూ బమ్మెరవారి మనోభావాలకూ అద్దం పట్టిన పద్యం, ఈ పద్యం కూడా అమూలకమే

ప్రహ్లాదుని పలుకులు విని హిరణ్యకశిపుడు మండిపడతాడు. కొడుకును దారిలోకి తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు. బెదిరిస్తాడు, ధిక్కరిస్తాడు, వేధిస్తాడు. బాధిస్తాడు. అనేక విధాల హింసిస్తాడు, ఏనుగులతో త్రొక్కిస్తాడపాములతో కరిపిస్తాడు, శూలాలతో పొడిపిస్తాడు. ఎన్నిచేసినా ప్రహ్లాదుని దేహంతోపాటు అతని భక్తి భావనకూడా చెక్కుచెదరదు. చివరకు తండ్రి తనయుణ్ణి గద్దిస్తాడు.

ఇందుకు పరమభాగవతుడైన ప్రహ్లాదుని సమాధానం

ఇందుఁ గలఁ డందు లేఁ డని, సందేహము వలదు; చక్రి సర్వోపగతుం;
డెందెందు వెదకి చూచిన, నందందే గలఁడు దానవాగ్రణి! వింటే

ఈ విధంగా ఎక్కడా లేడని హిరణ్యకశిపుడూ, అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు వాదులాడుకున్నారు

ఇక్కడ పోతురాజు గారు ఒక చక్కని పద్యం వ్రాశారు

హరి సర్వాకృతులం గలం”డనుచుఁ బ్రహ్లాదుండు భాషింప స
త్వరుఁడై” యెందును లేఁడు లేదని సుతున్ దైత్యుండు తర్జింప, శ్రీ
వరసింహాకృతి నుండె నచ్యుతుఁడు నానా జంగమ స్థావరో

త్కరగర్భకిబుల వన్నిదేశముల నుద్దండ ప్రభావంబునన్

“ఈ తర్జన భర్జనలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో, హిరణ్య కశిపుడు ఎక్కడ చూపించమని అంటాడో అని తన భక్తుడైన ప్రహ్లాదుని పలుకు సత్యం కాకుండా ఉండటం కోసం భగవంతుడు చరాచర ప్రపంచంలో

ప్రతి అణువులోనూ ప్రవేశించి ఉన్నాడట! ఎప్పుడు ఎక్కడ కావాలంటే అప్పుడు అక్కడ ప్రత్యక్షం కావాలని….

ఇక చదవండి……

Potana  Bhagavatam Vol-3       Download PDF Book

Read Potana Bhagavatam vol-3 online here.

potana-bhagavatam-vol-3
Follow us on Social Media